ఇంట్లో డబ్బు నిలవడంలేదంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఒక్కటి చేయండి
వాస్తు శాస్త్రంపై నమ్మకం ఉంచి దాన్ని అనుసరించేవారు అన్నిరకాలుగా ప్రశాంతంగా జీవిస్తుంటారు. కొంతమంది ఏముందిలే అని కొట్టేస్తుంటారు. అయితే ఎవరి నమ్మకం వారిది. నమ్ముకున్నవారు తమకు వాస్తును అనుసరించడంవల్ల కలిసివచ్చిందని చెబుతారు. ఎందుకంటే వాస్తు సరిగా ఉంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండి ప్రశాంతంగా జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి ఇంట్లో డబ్బు నిలవదు. ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంటుంది. ఇటువంటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.
ఉప్పు, లవంగాలను కాంస్య పాత్రలో ఉంచి ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచాలి.
దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురుకావు.
సంపద నిలవడానికి సహాయపడుతుంది.
కాంస్య పాత్రలో ఉప్పు ఉంచి బాత్ రూపంలో ఓ మూలన పెట్టాలి.
ఎందుకంటే ప్రతికూల శక్తులకు బాత్ రూం ఆవాసం లాంటిది.

ఒత్తిడితో ఉన్నవారు, తరుచుగా ఆందోళన చెందేవారు కొంచెం ఉప్పును కర్చీఫ్ లో కట్టి జేబులో పెట్టుకోవాలి.
దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు.
అలాగే పర్సులో కూడా చిన్న కాగితంలో ఉప్పు కట్టి పెట్టుకోవాలి.
దీనివల్ల ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, డబ్బు నిలుస్తుంది.
వాస్తు ప్రకారం ఉప్పు ఇంట్లో ప్రతికూల శక్తిని పారద్రోలుతుంది.
కాంస్య పాత్రలో ఉప్పు, లవంగాలు ఉంచడంవల్ల ధన ప్రవాహం ఉంటుంది.
ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు కలిపి తుడిస్తే చాలా మంచిది.
ఇలా చేయడంవల్ల కుటుంబంలో వివాదాలు తలెత్తవు.
ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications