vastu tips: డబ్బులు అక్కడ పెడితే మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే!
జీవితానికి విలువను జోడించి శాంతిని చేకూర్చేదే వాస్తు శాస్త్రం.
వాస్తు శాస్త్రం జీవితానికి విలువను జోడిస్తుంది. అంతేకాదు శాంతి, శ్రేయస్సును తేవడంతోపాటు ప్రతి వాస్తు చిట్కా వెనుక ఒక లోతైన శాస్త్రీయ కారణం ఉంటుందని విశ్లేషించి చెబుతుంది. నిపుణులు కూడా వాటిని ఆమోదించడం యోగ్యమని చెబుతున్నారు. ప్రముఖ వాస్తు నిపుణులు శ్రీమతి షెల్లీ మహేశ్వరి గుప్తా కొన్ని చిట్కాలు చెప్పారు. కొత్త సంవత్సరంలో అదృష్టం కోసం వీటిని ఎలా అనుసరిచ్చొచ్చంటే..
1. భోజనాల గదికి ఉత్తరం లేదా ఈశాన్య గోడపై పెద్ద అద్దం అమర్చాలి. దీనివల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది.
2. ఇంటి నైరుతి మూలలో దక్షిణ దిక్కువైపు తలపెట్టి నిద్రించాలి.
3. హింసను ఏ రూపంలోనైనా చిత్రీకరించే చిత్రాలు లేదా ఫోటోలు ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ఉంచకూడదు. హింస ప్రతికూలతను ఆకర్షించడంతోపాటు మీ ఎదుగుదల నిరోధిస్తుంది.
4. దక్షిణాన ఎరుపు కాంతిని అమర్చడంద్వారా కీర్తి, విజయం లభిస్తాయి.
5. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే నైరుతి దిశలో ఆ కుటుంబ సభ్యుల చిత్రాలు ఉంచాలి.

6. పిల్లలు ఉత్తరంవైపు ఎదురుగా ఉంటే చదువులో విజయం సాధిస్తారు.
7. వివాహం చేసుకోవాలనుకునే బ్రహ్మచారులు తమ ఇంటి వాయువ్య దిశలో ఉన్న గదుల్లో ఉండాలి లేదంటే డ్రాయింగ్ రూమ్‌లో నైరుతి దిశలో పన్నీర్ పువ్వులు ఉంచాలి.
8. ఉత్తరాన తయారు చేసిన డ్రాయర్లలో నగదు ఉంచడంద్వారా మీ అదృష్టం రెట్టింపవుతుంది. డ్రాయర్ లోపల అద్దం అమర్చాలి.
9. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, తగాదాలవంటి సమస్యలను పరిష్కరించడానికి స్ఫటికాలతో కూడిన విండ్-చైమ్‌లను బెడ్‌రూమ్ కిటికీలపై ఉంచాలి.
10. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వైఖరి ఉండటం కోసం శక్తులు స్వేచ్ఛగా ఇంటి మధ్యలో ఉండేలా చూసుకోవాలి.












Click it and Unblock the Notifications