Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర త్రికోణ రాజయోగంతో వీరు జాక్‌పాట్ కొడతారు.. మీరున్నారా?

శని గ్రహానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శని సహనాన్ని, క్రమశిక్షణను ఇచ్చే గ్రహం. అటువంటి శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తోంది. అయితే జూన్ 29వ తేదీ రాత్రి 11:40నిమిషాలకు శని కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. కుంభరాశిలో శని తిరోగమనం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ కేంద్ర త్రికోణ రాజయోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో వీరికి జాక్పాట్ తగులుతుందని చెప్పవచ్చు.

కేంద్ర త్రికోణ రాజయోగం ఇలా
జాతకంలో మొదటి, నాలుగవ, ఏడవ, 10వ గృహాలను కేంద్రం అని పిలుస్తారు. ఐదు, తొమ్మిది గృహాలను త్రికోణమంటారు. ఈ త్రికోణ గృహాలు లక్ష్మీదేవితో, కేంద్ర గృహాలు విష్ణువుతో పాలించబడతాయి. శని తిరోగమనం చెందినప్పుడు ఈ కేంద్ర మరియు త్రికోణ గృహాల మధ్య సంబంధం ఏర్పడితే దీనిని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు. ఈ రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jackpot to these zodiac signs by Kendra Trikona Rajayoga with Saturn retrograde

కుంభరాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇక ఇప్పటినుంచి కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలైనట్టుగా చెప్పవచ్చు. కుంభరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. అన్ని రంగాలలోనూ పురోగతి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృషభరాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఈ సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని అనుకున్న కచ్చితంగా సక్సెస్ అవుతుంది.

మిధున రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం మిధున రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+