జులై నెలలో సుడి తిరిగే రాశులు వీరే
జ్యోతిష్యం గ్రహాల స్థితిగతులు మారితే రాశిచక్ర గుర్తుల స్థితిగతులు కూడా మారతాయి. వచ్చే నెల 18వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే నెల 24వ తేదీన ఆ రాశిలోనే మరో పాదంలోకి బుధుడు మారతాడు. 26వ తేదీన సంపదలకు కారకుడయ్యే శుక్రుడు మిథునరాశిలోకి, కుజుడు 28వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా గ్రహాల కదలికలన్నీ కొన్ని రాశులకు మంచి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి. జులై నెలలో అదృష్టవంతులయ్యే రాశుల వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
సామాజికంగా ఈ రాశివారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారాలద్వారా ప్రయోజనాలు అంది ఆర్థికంగా స్థిరపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడుపుతారు. పనిచేసేచోట తీవ్రంగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు.

వృశ్చిక రాశి
ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు. తద్వారా పై అధికారులు వీరికి వేతనం పెంచి పదోన్నతి ఇస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. ప్రత్యర్థులపై, శత్రువులపై విజయాలను సాధిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి ఆదాయం అందుకుంటారు.
మేష రాశి
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఇది మీరు ఊహించనది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తిచేస్తారు. కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేస్తారు. దాంపత్య జీవితంలో సుఖసంతోషాలుంటాయి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వాటితోపాటు వేతనం కూడా పెరుగుతుంది. ఉద్యోగం రానివారికి ఉద్యోగం దొరుకుతుంది.












Click it and Unblock the Notifications