ఎల్లుండి బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. బుధుడిని శుభప్రదంగా భావిస్తారు. జూన్ 7వ తేదీన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. 24వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఇప్పటికే అక్కడ ఉన్న భానుడితో బుధ-సూర్య సంయోగం ఉంటుంది. దీనివల్ల ఏర్పడేదాన్ని బుధాదిత్య రాజయోగం అంటారు. దీని ప్రభావం అనేక రాశులవారిపై ఉండనుంది. శుభ సమయం ప్రారంభమై కలిసివచ్చే రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి
బుధాదిత్య రాజయోగంతో మేష రాశివారిలో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. అంతేకాదు.. ఈ సమయం ఉద్యోగులకు అత్యంత అనుకూలం. పై అధికారుల నుంచి ప్రశసంసలందుకోవడంతోపాటు పనితీరుపై అందరి నుంచి అభినందనలు అందుతాయి. ప్రమోషన్ ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల ప్రశాంతత ఏర్పడుతుంది.

వృషభ రాశి
ఈ రాశివారు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. సోమరితనం వదిలేసి ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెల్లివిరుస్తుంది.
మిథున రాశి
ఈ రాశిలోనే బాధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో మిథునరాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ఆర్థికంగా అదనపు బలం చేకూరినట్లవుతుంది. వీరికి డబ్బులు నాలుగు విధాలుగా వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే అవి ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు కూడా ఫలించి మంచి కంపెనీల్లో ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు.
సింహ రాశి
బుధాదిత్య యోగం వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తోన్న దంపతులకు సంతోషం కలిగించే వార్త వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల రాశి
ఈ రాశివారు చేపట్టే ప్రతి పనిలో అదృష్టం కలిసివస్తుంది. ఆటంకాలతో గతంలో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమై కలిసివస్తుంది. ఆర్థికంగా ఊహించని లాభాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications