మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. మార్చి 11వ తేదీన బృహస్పతి మిధునరాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం తిరోగమనంలో సంచారం చేస్తున్న బృహస్పతి ప్రత్యక్షంగా మారడం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది. బృహస్పతి జూన్ 26న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష కదలిక జరుపుతున్న బృహస్పతి సంచారం కారణంగా అదృష్టవంతులవుతున్న ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష కదలిక చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ రాశి వారి సంచార చార్ట్ లో బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటుంది. ఈ ఇల్లు ధైర్యం, కమ్యూనికేషన్ మరియు తోబుట్టువులకు కారకంగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలో మేష రాశి జాతకులకు సానుకూల మార్పులు కనిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పదోన్నతులు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభరాశి
వృషభరాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష కదలిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశిలో 2 ఇంట్లో బృహస్పతి ఉంటుంది. దాని ప్రత్యక్ష దశ ఆర్థికస్థితికి అనేక అవకాశాలను ఇస్తుంది. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనిని అభినందిస్తారు. వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. లాభాలను ఆర్జించడానికి బాగుంటుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. వృషభరాశి వారి వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశిలో బృహస్పతి నేరుగా లగ్న గృహంలో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వారు అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశి వారికి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనలో నిమగ్నమైన వారు గణనీయమైన విజయాలను సాధిస్తారు. ఇది వీరికి అన్నివిధాలా శుభ ఫలితాలు ఇస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications