ధన త్రయోదశి నుండి వీరికి బండ్ల కొద్దీ బంగారం పంపనున్న బృహస్పతి

వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించే వాడిగా చెబుతారు . ఆధ్యాత్మికతకు, సంపదకు, శ్రేయస్సు కు బృహస్పతి కారకుడు. అటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత తన ఉత్కృష్ట రాశి అయిన కర్కాటక రాశిలోకి ధన త్రయోదశి నాడు ప్రవేశిస్తున్నాడు.

ధన త్రయోదశి రోజున కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశం
అక్టోబర్ 18న ధన త్రయోదశి రోజున కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఆయా రాశుల వారి కెరీర్ బాగుంటుంది. ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Jupiter to send these zodiac signs cartloads of gold from Dhana Trayodashi

కర్కాటక రాశి
ధన త్రయోదశి రోజు బృహస్పతి తన ఉచ్ఛ రాశిలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. కర్కాటక రాశి నుండి లగ్నానికి బృహస్పతి సంచారం జరుగుతున్నందున ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు పనిలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులారాశి
ధన త్రయోదశి రోజు బృహస్పతి సంచారం తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు అనేక ఆర్థిక లాభాలను చూస్తారు. పనిచేసే చోట గుర్తింపుని చూస్తారు. కొత్తగా కెరీర్ ను ప్రారంభించిన వారికి ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది. కంపెనీలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొత్త నాయకత్వాలు అవకాశాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థికలాభాలను పొందుతారు. తండ్రితో సంబంధాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి
ధన త్రయోదశి నాడు బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన వృశ్చికరాశిలోకి ప్రవేశించడంతో వృశ్చిక రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో కర్మ గృహంలో బృహస్పతి సంచారం చేస్తాడు. ఈ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారి కుటుంబ మరియు వైవాహిక జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. సంబంధాలు బలపడతాయి. మతపరమైన కార్యక్రమాలలో, శుభకార్యాలలో పాల్గొంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాలు సాధిస్తారు.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+