ఏలినాటి శని నుంచి విముక్తి... జమిందారులయ్యే రాశులు వీరే
శనిదేవుడు అంటే అందరూ భయపడతారు. కానీ ఎంతో మేలు చేస్తాడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి పనులు చేసినవారికి అంతకు రెట్టింపు స్థాయిలో అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంటాడు. కొందరు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతుంటారు. వీరి జాతకంలో శనిదేవుడు అశుభమైన స్థానంలో ఉంటే సమస్యలు తప్పవు. మార్చి 13వ తేదీన మీన రాశిలో శనిదేవుడు అస్తమిస్తున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులకు అంతులేని మేలు కలుగుతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
కుంభరాశి
మీడియా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రధానంగా వీరి మాటల ప్రభావం ఊహించని స్థాయిలో ఉంటుంది. ఎదుటివారిని వీరు మెస్మరైజ్ చేస్తారు. అంతగా వీరి ప్రభావం ఎదుటివారిపై ఉంటుంది. కుంభరాశిలో ఇదే సమయంలో ఏర్పడుతున్న పంచగ్రాహి రాజయోగం కూడా ఈ రాశివారికి అదృష్టాన్ని మోసుకొస్తోంది.

ధనస్సు రాశి
తల్లిదండ్రులతో గతంలోకంటే ఇప్పుడు చాలా బాగుంటారు. అందరి మధ్య ప్రేమ పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించి తీసుకుంటారు. భారీగా డబ్బును సంపాదిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి అద్భుతమైన అవకాశాలు తలుపుతడతాయి. సంతోషంగా ఉంటారు. సౌకర్యాలు కూడా ఊహించనిరీతిలో పెరుగుతాయి.
మీన రాశి
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. దీంతో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తిచేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అనుకుంటున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు విశేషమైన లాభాలను ఆర్జిస్తారు. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. డబ్బులు భారీగా వస్తాయి. ఊహించనిస్థాయిలో సమాజంలో మంచి పేరు వస్తుంది.












Click it and Unblock the Notifications