కార్తీక పౌర్ణమి 2024: ఈ ఒక్క పనితో మీఇంట సంపదల వర్షం!
కార్తీక పౌర్ణమికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిధిలో 15 వ రోజున కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది . కార్తీక మాసం అంటే పరమశివునికి, విష్ణు మూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పరమశివుడిని, విష్ణుమూర్తిని ఎంతో భక్తితో ప్రార్థిస్తే మీలోని దోషాలు తొలగిపోయి మంచి జీవితం వస్తుందని చాలా మంది నమ్మకం.
కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం
కార్తీక మాసంలో నదులు, సముద్రాలలో పవిత్ర స్నానం చేయడం, దానాలు చేయడం, ఉపవాసం చేయడం, దీపాలు వెలిగించడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయటం వంటి పనులు చేయడం వల్ల అద్భుతమైన పుణ్యాలు వస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు, భక్తులందరూ పొద్దున్నే నిద్రలేచి, స్నానం చేసి, శివునికి రుద్రాభిషేకం చేయడానికి శివాలయాలకు వెళతారు, ఎందుకంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని వారు నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి నాడు ఈ పనులతో శుభం
ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న వచ్చింది. మీరు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాసం చేస్తూ, సాయంత్రం దేవాలయంలో కానీ, ఇంటివద్ద కానీ, తులసి, ఉసిరి చెట్ల వద్ద కానీ నూనెతో దీపాలను వెలిగిస్తే అది మనకు శుభాలను చేకూరుస్తుంది. సిరి సంపదలను, సుఖ శాంతులను ప్రసాదిస్తుంది.
కార్తీక మాసంలో ఉసిరికి ప్రత్యేక స్థానం
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వేళ, ఉసిరి కాయలతో చేసిన దీపాలను వెలిగించి, శివునికి మరియు విష్ణువులకు ఇష్టమైన ఉసిరి చెట్టుకు పూజలు చేస్తే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో స్నానం చేస్తే పుణ్యం కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి కాయలతో మరొక పని చేసినా సిరి సంపదల వర్షం కురుస్తుంది.
కార్తీక పౌర్ణమికి ఈ దానాలతో సిరిసంపదలు
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మనకు ఊహించనంత పుణ్యం లభిస్తుంది. ఉసిరికాయలను దానం చేసిన వారిపైన లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్క ఉసిరికాయలే కాదు కార్తీక మాసంలో చేసిన దానాలు కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమవుతాయి. కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపదానం చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది. అలాగే బియ్యం పిండి, గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు, వెండి ప్రమిదలను దానం చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది. ఆమె చల్లని చూపుతో మీరు సంపన్నులవుతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications