ఇంట్లో కుక్కను పెంచటం శుభం; మూడు గ్రహాల అనుగ్రహం!!
చాలామంది ఈరోజు ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు. కుక్కలను ఏ ఉద్దేశంతో పెంచుకున్నా సరే కుక్కల వల్ల మనకు శుభమే జరుగుతుందని అంటున్నారు. అయితే ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది. ఎవరి ఇళ్లలో అయితే కుక్కలను పెంచుతారో ఆ ఇళ్లలో గ్రహాల దోషాలు తొలగిపోతాయని, వారి జీవితం సాఫీగా సాగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కుక్కలను కేతువుతో సంబంధమున్న జీవులుగా భావిస్తారు. ఇటువంటి కుక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు చెడు కలిగిస్తారని అంతా భావించే గ్రహాలైన శని, రాహువు, కేతువుల ప్రభావం తొలగిపోతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఇంట్లో నల్ల కుక్కను ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. ఇంట్లో కుక్కలు ఉంటే ప్రతికూలతలను కుక్కలు తొలగిస్తాయి అని చెబుతారు.

ఇంట్లో నల్ల కుక్క ఉంటే అది ఇంటిని చెడు నుండి రక్షిస్తుందని చెబుతారు. అసలు కుక్కలను పెంచడం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. నల్ల కుక్కకు రొట్టె ముక్కలను తినిపించడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు అని చెబుతారు. దీనివల్ల జీవితంలో శనిదేవుడి కారణంగా ఉండే అనేక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.
కుక్కను కాలభైరవుని యొక్క వాహనం అంటారు. కుక్కకు నూనెతో తయారు చేసిన రొట్టెలను తినిపించడం వల్ల తప్పకుండా కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతాడని, ఇది జీవితంలోని అన్ని కష్టాలను నివారిస్తుందని చెబుతారు. చాలామంది జీవితాలలో తీవ్రమైన గ్రహదోషాలు ఉన్నప్పుడు కుక్కలకు ఆహారం పెట్టమని చెబుతూ ఉంటారు.

కుక్కలకు రొట్టెలు పెట్టమని, కుక్కలను కొట్టకూడదని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది కుక్కలను పెంచడానికి ఇష్టపడని వారు, ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటే కుక్కలను పెంచడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఇంటిని దుష్టశక్తుల నుండి, గ్రహ దోషాల నుండి కుక్కలు కాపాడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications