Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుంభరాశి ( Aquarius) వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం. ర ఉగాది వార్షిక ఫలితాలు

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య

కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి చెందుతారు.

కుంభరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో

ఆదాయం - 5, వ్యయం - 2

రాజపూజ్యం - 5 , అవమానం - 4

Know the Ugadi annual results for those who bear aquarius as Zodiac sign

* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి 7 ఏప్రిల్ 2022 వరకు జన్మం ( కుంభం ) లోని ఫలితాలు ప్రభుత్వమూలక ఇబ్బందులు ఏర్పడే సూచనలు. ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. 7 ఏప్రిల్ 2022 తరవాత ద్వితీయ భావంలోకి ప్రవేశం వలన భూమి, గృహ లాభాలు. వృత్తి పరంగా సంతృప్తి ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. మాట నైపుణ్యంతో అన్ని పనులు నెరవేర్చుకోగలరు. సమాజంలో గౌరవం , సన్మానాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని గ్రహించండి.

* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు 23 మార్చి 2028 వరకు ఉంటుంది. ప్రస్తుత గోచారంలో ఫిబ్రవరి 2023 వరకు వ్యయంలో ఉండి తర్వత జన్మరాశి కుంభంలో ప్రవేశించును కావలసిన వసతులు ఏర్పడవు. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అవసరాల కొరకు ఋణాలు చేయవలసి వస్తుంది. చేసిన అప్పులు తీర్చుటకు ఆదాయ వనరులు కనబడక ఇబ్బందులు కలుగుతాయి. అణువుగాని చోట అధికులమనరాదు అన్నట్టుగా అన్ని చోట్ల సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం ఉత్తమం. అన్నదమ్ములతో భాగస్వాములతో తగువులు లేకుండా చూసుకోవడం జాగ్రత్త పడడం ఉత్తమం. రావలసిన డబ్బులు సకాలంలో అందవు, ఊహించని ఖర్చులు, సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరంలో వాత ప్రకృతి అధికం అవుతుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు పెట్టె అవకాశం ఉన్నది. వాహణాలతో జాగ్రత్తలు అవసరం.

* రాహువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి తృతీయ భావంలో.. చేసే పని ఏదైననూ ధైర్యం మొదలు పెట్టండి విజయం వరిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ది కనబడుతుంది.

* కేతువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి నవమ భావంలో సంచారం వలన వాహనాల వలన ఇబ్బందులు. కుటుంబ పెద్దలకు అనారోగ్యం. తీర్ధ యాత్రలు చేస్తారు.

గురు గ్రహం ప్రభావంతో ఈ ఏడాది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

విద్యార్థులకు విజయం లభిస్తుంది.

శని గ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రాహువు ప్రభావంతో కొన్ని సంధర్భాలలో కోపం కంట్రోల్ చేసుకోలేక పోతారు, సహనం అవసరం అని గ్రహించండి.

కేతువు ప్రభావం వలన ఆర్థిక పరంగా లాభాలొస్తాయి.

నరదృష్టి, శత్రువుల బెడద.

ఖర్చులు తగ్గించండి.

ఆడంబరాలకు దూరంగా ఉండండి, స్థిరాస్థులు కొనండి.

చెడు స్నేహాలు చేయకండి, వారే మీకు సంఘంలో అవమానాలను పెంచుతారు.

వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా పండినా ఆర్ధికంగా కుడుటపడలేరు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉన్నది.

వ్యాపారస్తులకు ఆశించినంత వ్యాపారములు చేస్తారు కానీ లాభాలు తక్కువే.

రాజకీయనాయకులకు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.

విద్యార్ధులు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తారు.

Know the Ugadi annual results for those who bear aquarius as Zodiac sign

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు లక్ష్మీ నారసింహా హోమం, అభిషేకం జరిపించండి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+