క్రోధి నామ ఉగాది పంచాంగం: కన్యారాశి వారికి విశేష ధనలాభం.. అయినా జాగ్రత్త!!
క్రోధి నామ ఉగాది సంవత్సరంలో కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకు కలిసొస్తుందా? ఏ విషయాలలో కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి? వంటి వివరాలను ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.
గురువు భాగ్య స్థానంలో.. విశేష ధనలాభం
ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 గా ఉంది. రాజపూజ్యం 5 అవమానం 2గా ఉంది. 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి శని ఆరో స్థానంలో అనుకూలంగా ఉంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. ఆపై మే నుంచి గురుడు భాగ్య స్థానంలో సంచరించడం వల్ల కన్యారాశి జాతకులకు ధన లాభం, పేరు ప్రతిష్టలు కలుగుతాయి.

కన్యా రాశి జాతకులకు అంతా అనుకూలం
కన్య రాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రథమార్ధం కొన్ని ఒత్తిడులు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ద్వితీయ అర్థం కన్యారాశి జాతకులకు ఆర్థికంగాను, ఆరోగ్య పరంగాను లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి అంతా అనుకూలంగానే ఉంది.
ఆర్థికపరంగా
కన్య రాశి వారికి 2024 ఆర్థికంగా చాలా అనుకూలమైన సంవత్సరం. ఆర్ధిక పరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు 2024 మంచి లాభాలను ఇస్తుంది. కన్య రాశి జాతకులకు ఈ సంవత్సరం లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఫలితంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనుకున్నవన్నీ నెరవేరుతాయి.
కుటుంబ పరంగా
కన్యా రాశి వారికి కుటుంబ పరంగా ఏప్రిల్ వరకు కాస్త ప్రతికూలంగా, ఆ తర్వాత మే నుండి సంవత్సరం అంతా అనుకూలంగానూ ఉంటుంది. కన్యా రాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా గడుపుతారు. ఏప్రిల్ వరకు జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. 2024 సంవత్సరం ద్వితీయార్థంలో కన్య రాశి వారికి కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది.
కెరీర్ పరంగా
కన్య రాశి జాతకుల కెరీర్ మే నుండి అద్భుతంగా ఉంటుంది. ప్రథమార్దంలో కొంత ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం చేసే వారికి మే నుండి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
ఆరోగ్యపరంగా
కన్య రాశి వారికి ఆరోగ్యపరంగా ప్రధమార్ధంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ద్వితీయార్థంలో కాస్త అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ద్వితీయార్థం లోనే బాగుంది. 2024లో కన్యారాశి జాతకులు శారీరకంగా సౌఖ్యాన్ని అనుభవిస్తారు అయితే ఆవేశపూరితమైన నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications