శ్రావణ మాసంలో ఈ రాశులవారంటే డబ్బుకు చాలా ఇష్టం
ఆగస్టు ఐదోతేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. శ్రావణం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో సోమవారం, శుక్రవారం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు.. ఎన్నో పండగలు ఈ నెలలోనే జరుపుకుంటాం. నాగపంచమి, రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి లాంటివి జరుపుకుంటాం.
ఈ మాసంలో అందరూ లక్ష్మీదేవిని పూజించడంతోపాటు పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఈ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. అలాగే ఐదు యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. కుబేర యోగం, బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, శష యోగం, నవపంచమ యోగం ఏర్పడుతుండటంతో నాలుగు రాశులవారికి బాగా కలిసివస్తోంది. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.

మకరం
ఈ సమయంలో వీరు శత్రువులు అనుకున్నవారు కూడా మిత్రులుగా మారతారు. వారి నుంచి మకర రాశివారికి మంచి సహకారం అందుతుంది. ధనలాభం కలుగుతుండటంతో ఇంటి స్థలాలమీద, పొదుపుమీద దృష్టిసారిస్తారు. స్థలాల కొనుగోలులో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరిని కుబేరులను చేస్తుందని చెప్పొచ్చు.
కర్కాటకం
వీరికి ఊహించని రీతిలో ధనం వస్తుంది. ఈ నెలలో వీరు ఎంత ఖర్చుచేసినా రెట్టింపు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే డబ్బులు వీరికి ఆకర్షితులవుతాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది. కాకపోతే వీరు ఎంత శ్రమపడితే అంత ఆదాయాన్ని పొందుతారు.
మీన రాశి
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దీనివల్ల ఎన్నడూ ఊహించని రీతిలో వీరి షేర్ల ధరలు పెరుగుతాయి. జీవితంలో రాణించడానికి సోదరులు బాగా సహకరిస్తారు. డబ్బుల విషయంలో తోబుట్టువుల నుంచి సాయం అంది మంచి స్థాయికి వస్తారు. బాగా స్థిరపడిన తర్వాత వారి డబ్బులను తిరిగిచ్చేయడంవల్ల కూడా వీరికి బాగా కలిసివస్తుంది.
మిథునం
ఎప్పటినుంచో కోర్టుల్లో నలుగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతిరోజు ఈ రాశివారు రావి చెట్టు నీడలో నెయ్యితో దీపారాధన చేయడంవల్ల బాగా కలిసివస్తుంది. పెళ్లి కానివారికి నచ్చిన అమ్మాయితో వివాహ యోగం ఉంది. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సులువుగా సంపాదిస్తారు. వివాహ బంధంలో ఉన్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సంతోషాన్ని చవిచూస్తారు.












Click it and Unblock the Notifications