అదృష్టవంతులంటే ఈ రాశులవారే.. లక్ష్మీదేవి వెంటే ఉంటుంది
లక్ష్మీదేవి తలుపు తడితే స్వాగతించనివారే ఉండరు. వేపాకు చేదుగా ఉంటుందికానీ డబ్బు ఎవరికీ, ఎప్పటికీ చేదు అవదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సిరిసంపదలకు లోటుండదు. అమ్మవారి కరుణ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. రకరకాల పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని రాశులవారినే ఆ అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అందరినీ వరించకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఆ తల్లి కటాక్షం కోసమే పడిగాపులు పడుతుంటారు. లక్ష్మీదేవి ఆశ్వీర్వాదాలు ఎప్పుడూ ఉండే రాశుల వారి వివరాలను తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశిలో పుట్టిన వారు ఎప్పుడూ అదృష్టవంతులే. వారికి పెద్దగా డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. ఎటువంటి కొరత ఏర్పడదు. శుక్ర గ్రహం వీరికి సంబంధించినదే. ఆ ప్రకారం చూసినా సిరి సంపదలు, ఆనందం, సుఖసంతోషాలకు నిలయమవుతుంది.

కర్కాటకం
కర్కాటక రాశివారిపై లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మిగతా వారు వీరిని చూసి... వీళ్ల పనే బాగుంది... ఏ లోటూ లేదు అనుకునేలా ఉంటారు. అమ్మవారి కృప వీరిపై ఉండటానికి ప్రధాన కారణం వీరు బాగా కష్టపడి పనిచేస్తారు. ఒకరకంగా వీరిని అందరూ పని రాక్షసులు అని తిడుతుంటారు. వీరికి ధనప్రాప్తి ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని ప్రేమిస్తారు. డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా ఉంటుంది. దీనికోసం వీరు ఎంతైనా కష్టపడతారు. సమస్యలు ఉన్నచోట తెగించి ముందడుగు వేస్తారు. అందువల్ల లక్ష్మీదేవి వీరితోనే ఉంటుంది. డబ్బు కొరత కానీ, ఆర్థిక సమస్యలుకానీ ఏర్పడవు.












Click it and Unblock the Notifications