సింహరాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారా..? వారి గ్రహబలం ఎలా ఉంది..?

సింహరాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 14 , వ్యయం - 2 రాజపూజ్యం - 2 , అవమానం - 7

• ఏకాదశంలో ఉన్న రాహువు, పంచమంలో ఉన్న కేతువు, షష్టమంలో ఉన్న శని ఉన్న కారణం చేత

• సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది.

• గత 14 సంవత్సరాల నుండి మీరు పడుతున్న వ్యయ ప్రయాసలు, బాధలు తొలగిపోతాయి.

• స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

Leo 2020 Horoscope - Major Life Changes to expect!

• విద్యార్ధులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు.

• పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగా సాగుతుంది.

• మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు.

• రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి, సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు.

• వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి.

• విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు.

• సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు.

• ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషం.

• కొన్ని సందర్భాలలో మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

• విద్య వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు.

• క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు, ఆలోచనలు నిజమవుతాయి.

• సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

• గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి.

• కుటుంబ , సన్నిహితుల వైకరితో సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది.

• రక్షాయంత్రం ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

• వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయట పెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు.

• సివిల్‌ సర్వీస్‌లు, ఇతర టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది.

• వ్యక్తిగత, ఆఫీసు రహస్యాలను శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+