అక్టోబరు 2 సూర్య గ్రహణం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం అక్టోబరు నెల ఎంతో ప్రధానమైంది. ప్రధాన గ్రహాలన్నీ ఈ నెలలో సంచారం చేస్తుంటాయి. అలాగే ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబరు రెండోతేదీన ఏర్పడబోతోంది. దీనివల్ల మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఎన్నడూ పొందలేని లాభాలను పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారు ఏవిధంగా ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం.
వృషభరాశి
ఈ రాశివారు అత్యధిక లాభాలను పొందనున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం తోడుండటంవల్ల సులభంగా విజయాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. మొదటినుంచి చేస్తున్న పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలున్నాయి.

కన్యారాశి
ఊహించని స్థాయిలో సంపద పెరుగుతుండటంతో వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగులకు వేతనం పెరగడంతోపాటు కార్యాలయంలో అదనపు బాధ్యతలు తోడవుతాయి. డబ్బులు పొదుపు చేసే సమయంలో జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులు తీసుకోవాలి.
తులారాశి
విద్యార్థులకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. అనారోగ్యం దూరమవుతుంది. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వేతనం పెరుగుతుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సులువుగా పూర్తిచేస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న ఉద్యోగులు ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి.












Click it and Unblock the Notifications