Lunar Eclipse 2023: ఈ రాశుల వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు..ఎందుకు.?
డా.ఎం .ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది.
స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ, శనివారము తేది 28-10-2023 రోజున రాహుగ్రస్తచంద్ర గ్రహణం సంభవించనున్నది. ఖండగ్రాస సోమోపరాగము ధూమ్రవర్ణము ఉత్తర శరము అపసవ్య గ్రహణము వాయవ్య స్పర్శ, ఈశాన్య మోక్షము.

గ్రహణ స్పర్శ కాలము
రాత్రి గం. 01-05 ని.లు.
నిమీలన కాలము 4
00.01-24 2.
మధ్య కాలము
00.01- 44 2.
ఉన్మీలనకాలము
రాత్రి గం. 02-01 ని.లు
మోక్షకాలము రాత్రి గం. 02 -22 ని.లు
ఆద్యంత పుణ్యకాలము
రా.గం. 01-37 నిమిషాలు.
ఈ గ్రహణము రాత్రి సంభవించుటచే సాయంకాలము గం 4 లోపు భోజనాది ప్రత్యబ్దికములు పూర్తి చేసుకోవాలి. గ్రహణ వేద సా.గం.04 నుండి ప్రారంభము.
* రాత్రి భోజనము పనికిరాదు.
ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రము మేశారాశిలో సంభవిస్తున్నది, కాబట్టి మేష, కర్కాటక, సింహరాశుల వారు చూడకూడదు. ఈ మూడు రాశులవారు గ్రహణ శాంతి చేయించండి శుభం జరుగుతుంది.
గ్రహణం కనిపించు ప్రదేశములు :-భారతదేశం, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిపిక్ మహా సముద్రం, అంటార్కటిక, ఆర్కిటిక, హిందూ మహాసముద్రంలలో కనబడుతున్నది.
గమనిక:- ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతమైన మనస్సుతో ఉండాలి, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. చంద్ర గ్రహణ సమయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకోకూడదు. భారతదేశ కాలమాన ప్రకారం గ్రహణం అర్ధరాత్రి కాబట్టి దాదాపు అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి బయపడాల్సిన అవసరం ఉండదు. శారీరక శక్తి ఉన్నవారు సాయంత్రం 4 గంటల వరకు ఘన పదార్ధాలు తీసుకోవాలి. ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు లిక్విడ్ పదార్ధాలు తీసుకోవచ్చును. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడే వారు 28వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు ఆహారం తీసుకోవచ్చును.












Click it and Unblock the Notifications