అక్టోబర్ 10వరకు వీరే కుబేరుడి వారసులు.. సెలవిచ్చిన సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలన్నింటిలో ముఖ్యమైన గ్రహాలకు రాజుగా చెప్పే సూర్యుడి సంచారం కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ 27 వరకు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచారం చేసిన గ్రహాల రాజు అయిన సూర్యుడు సెప్టెంబర్ 27న హస్త నక్షత్రంలో ప్రవేశించాడు.
హస్తా నక్షత్రంలో సూర్య సంచారం
సూర్యుడు హస్త నక్షత్రంలోనే అక్టోబర్ 10 వరకు ఉంటాడు. హస్త నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు ఈ సమయంలో ఊహించని ఆర్ధిక లాభాలను, సంపదలను పొందుతారు. హస్తా నక్షత్రంలో సూర్య సంచారంతో లబ్ది పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
హస్తా నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయం వృషభ రాశి వారికి కలిసొస్తుంది. వృషభ రాశి వారిలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.ఆర్ధిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో శుభ వార్తలు వింటారు. ఏ పని చేసినా ఈ సమయంలో వీరికి తిరుగుండదు.
కన్యా రాశి
కన్యారాశి జాతకులకు సూర్య నక్షత్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ 10 వరకు ఈ రాశులవారికి అన్నీ సానుకూల ప్రయోజనాలే వస్తాయి. ఈ సమయంలో వీరు శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా కూడా కన్యా రాశి జాతకులకు బాగుంటుంది. ఇది వీరికి అన్ని విధాలా శుభ సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు సూర్య నక్షత్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వీరు ఏ పని చేసినా సరే విజయం వరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ఇది సరైన సమయం. ఆర్ధికంగా ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications