సెప్టెంబర్ 13వరకు ఈరాశులవారు డబ్బుల విషయంలో జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మార్పు చెందుతూ అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రంలో ముఖ్య గ్రహాల అయినటువంటి శని, కుజుడు కారణంగా సెప్టెంబరు 13వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక కష్టాలు, నష్టాలు రాబోతున్నాయి. కుజుడు ఉగ్ర స్వభావం కలిగిన వాడు, ధైర్యానికి, సాహసానికి కారకుడు.
శని, కుజుల కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చే రాశులు
శని క్రమశిక్షణకు, న్యాయానికి కారకుడు. అటువంటి కుజుడు, శని ఒకదానికొకటి ఎదురెదురుగా రావడంతో కొన్ని రాశుల వారి పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచన. శని, కుజుల కారణంగా ప్రతికూల ఫలితాలు చూసే ఆ రాశులను తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారు కుజ, శని గ్రహాల కారణంగా ప్రతికూల ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వారు ఏ పని చేసినా శుభ ఫలితాలు రావు. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్త పడాలి. వృషభ రాశి వారికి ఈ సమయం కష్ట కాలం, కాబట్టి జాగ్రత్త.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత జీవితంలోనే కాదు, వృత్తి జీవితంలో కూడా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.. ఈ సమయంలో వీరు స్నేహితులకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. విపరీతమైన కోపం వస్తుంది. ఇది మీకు అనర్ధాలకు కారణం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
మీనరాశి జాతకులకు శని కుజ దృష్టి కారణంగా సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీనరాశి జాతకుల పనులు ఆలస్యం అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. కనుక మీనరాశి వారు సెప్టెంబరు 13 వరకు జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications