మే 27 ధన జ్యోతిష్యం..ఈ రాశులవారికి విజయోస్తు
మార్చి 27వ తేదీ నేడు.. ఈరోజు వివిధ రాశుల వారి జాతకాన్ని మనం చూసినట్లయితే కొన్ని రాశుల వారికి ఈ రోజు శుభాలు జరుగుతుండగా మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈరోజు కొందరికి ధనలక్ష్మి కటాక్షం ఉండగా మరికొందరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మేషరాశి
ఈరోజు మేషరాశి జాతకులు అదనపు పోటీ తత్వాన్ని చూడవచ్చు. ఈరోజు మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్ధికంగా బాగుంటుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠనం మంచిది.

వృషభరాశి
వృషభ రాశి వారు మనోధైర్యంతో ప్రయత్నించి అన్ని కార్యాలను సాధించగలుగుతారు. వృషభ రాశి జాతకులు ఉత్సాహం తగ్గకుండా నేడు పని చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ధికంగా బాగుంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. .చంద్రశేఖర అష్టకాన్ని చదివితే మంచిది.
మిధున రాశి
మిధున రాశి వారికి ఇది మిశ్రమ కాలంగా కనిపిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవుతారు. దుర్గ ధ్యాన శ్లోకాన్ని పఠించాలని సూచన.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ నేడు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని సందర్శించడం ఉత్తమం.
సింహరాశి
సింహరాశి జాతకులు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. సింహరాశి జాతకులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించటం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు నేడు ఒక వార్త బాధ కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. అయితే స్థిరమైన ఆలోచనలతో చేసే పనులు ఫలిస్తాయి అనేది గుర్తుంచుకోవలసిన అంశం. నేడు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం ఉపశమనం కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. ఆర్ధికంగా కలిసొస్తుంది. త్వరగా పూర్తయ్యే విధంగా పనులను ప్లాన్ చేసుకోవలసిన అవసరం ఉంది. ఈరోజు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవటం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు చేపట్టిన పనులలో చిన్న సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. ధనస్సు రాశి జాతకుల అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరోత్సాహపరిచే అవకాశం ఉంది. అయినా మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. చంద్ర ధ్యానం మంచిది.
మకర రాశి
మకర రాశి జాతకులు ఈరోజు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా ఫలవంతంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. దైవారాధన మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే సంప్రదించండి . ఈరోజు ఈశ్వర ధ్యానం మీకు మేలు చేస్తుంది. తోటి వారిని కలుపుకొని పోతే మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు చాలా శుభకాలంగా చెప్పవచ్చు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన బుద్ధితో వ్యవహరించి కొన్ని వ్యవహారాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు ఈ సమయంలో సహాయ సహకారాలు అందించడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. నేడు శివారాధన మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications