సెప్టెంబర్ 18న ఎదురెదురుగా బుధుడు - శని; నాలుగు రాశుల వారికి అదృష్టం!!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలను బట్టి రాశులు ప్రభావితం అవుతూ ఉంటాయి. సెప్టెంబరు 18వ తేదీన బుధుడు శని ఒకదానికొకటి ఎదురెదురుగా కదులుతాయి. దీనివల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సెప్టెంబర్ 18వ తేదీన బుధుడు శని ఒకదానికి ఒకటి ఎదురెదురుగా రావడం వల్ల మేష రాశి వారికి కలిసొస్తుంది. మేష రాశి జాతకులకు ఇది సరైన సమయం. ఈ సమయంలో వీరు కెరీర్ కు సంబంధించిన లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఇతర కుటుంబ సభ్యులతో వారి సంబంధం చెక్కుచెదరకుండా ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఇది అనుకూలమైన తరుణం. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

zodiac signs

బుధుడు శని ఒకదానికొకటి ఎదురుగా రావడం వల్ల మిధున రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లే వారికి ఇది అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఈ సమయంలో కేటాయిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లను పొందుతారు. ప్రస్తుతం మిధున రాశి వారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. ఏ రంగంలోకి వెళ్లిన విజయావకాశాలు ఉంటాయి. కుటుంబం కోసం చేసే ప్లాన్లు సక్సెస్ అవుతాయి.

బుధుడు శని ఒకదానికొకటి ఎదురుగా రావడం వల్ల తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది .అసంపూర్ణంగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కోరికలు తీర్చుకోవడానికి ఇది సరైన సమయం. తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. జీవన శైలిలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం వల్ల మంచి లైఫ్ ను అనుభవిస్తారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.

బుధుడు శని ఒకదానికొకటి ఎదురుగా రావడం వల్ల వృషభ రాశి వారికి కలిసొస్తుంది. వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్ధిక వనరులు మెరుగుపడతాయి. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో వివిధ ప్రదేశాలకు వెళ్లడానికి ఇది సరైన సమయం. తోబుట్టువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఏ సమస్య అయినా ఈ సమయంలో విజయవంతంగా మీరు పరిష్కరించగలరు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+