వృషభరాశిలోకి బుధుడు.. ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి..!

జూన్ 19న వృషభ రాశిలోకి గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు ప్రవేశించనున్నాడు. ఈ గ్రహం సౌర వ్యవస్థలో అతి చిన్నది. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం కూడా ఇదే. తెలివితేటలు, కమ్యూనికేషన్, ప్రసంగం, తార్కికానికి అధిపతి అయిన బుధుడు మిథున, కన్యా రాశులకు అధిపతి. బుధుడికి శుక్రుడు, శని స్నేహితులు. వారు అంగారకుడికి వ్యతిరేకంగా ఉంటారు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి బుధుడికి 15 రోజుల నుంచి 28 రోజుల సమయం పడుతుంది. 2023 జూన్ 7వ తేదీన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. తిరిగి 19వ తేదీ ఉదయం 7.16 గంటలకు అస్తమిస్తుంది. బుధుడు వృషభరాశిలో ఉండటంవల్ల ఏయే రాశులకు ప్రతికూలంగా మారుతుందో తెలుసుకుందాం.

మిథున రాశి:ఈ రాశివారు తమ కెరీర్ లో ఇక్కట్లను ఎదుర్కొంటారు. పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పని ఒత్తిడి పెరిగి మానసిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలతోపాటు వ్యూహాలను కూడా రూపొందించాల్సి ఉంటుంది. ఇది జరగకపోతే పోటీదారులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఖర్చులు పెరగడంతోపాటు ఆరోగ్యం క్షీణిస్తుంది. పొదుపు చేయడంలో కూడా చివరకు ఇబ్బంది ఏర్పడుతుంది.

Mercury in Taurus.. These zodiac signs should be careful

సింహ రాశి:వీరికి బుధుడి స్థానం కీలకం. ఈ రాశివారి కోరికలేవీ నెరవేరవు. కెరీర్ లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. పనిచేసేచోట అధికారులు గౌరవాన్ని దెబ్బతీస్తారు. వ్యాపారస్తులకు నష్టం కలుగుతుంది. వ్యాపారం పనిమీద దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక నష్టాలుంటాయి.

వృశ్చిక రాశి:ఏ విషయంలోను వీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. పై అధికారుల నుంచి మద్దతు లభించదు. కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితాలకు సమయం పడుతుంది. వ్యాపారంలో పోటీని ఎదుర్కొంటారు. బుధుడి అవరోహణ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పొదుపు చేయడంలో ఇక్కట్లను కలిగిస్తుంది.

ధనుస్సు రాశి:ఓపిక వహించాలి. భాగస్వామ్యంతో ఉంటే నష్టాలుంటాయి. ఆరోగ్యం క్షీణించడంతోపాటు ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ లో పెద్దగా పురోగతి ఉండదు.

మీన రాశి:కుటుంబంలో ఆందోళనలుంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడి పెట్టడానికి ముందు శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో కోపం తెచ్చుకోకూడదు. ఎదుటివారితో మొండిగా వాదించకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. ఆదాయంలో పెరుగుదల ఉండదు. ఖర్చులు మాత్రం పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+