2 సార్లు సంచరించి 2 సార్లు ఈ రాశులను అదృష్టవంతులను చేస్తున్న బుధుడు
బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. తెలివితేటలు, తర్కం, జ్ఞానం, వాపారానికి కారకుడు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగులేదు. డిసెంబరు నెలలో బుధుడు రెండుసార్లు సంచారం చేయబోతున్నాడు. 6వ తేదీన వృశ్చిక రాశిలోకి, 29వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా రెండుసార్లు రాశులను వెంటవెంటనే మార్చడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనివల్ల ఏ రాశులవారు దివ్యమైన ప్రయోజనాలు పొందుతున్నారనే వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. మీడియా, రచన, కళలు, మార్కెటింగ్, సమాచార రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. వారికి ఇది సక్సెస్ లను ఇచ్చే సమయం అని చెప్పొచ్చు. ఆలోచించి తీసుకున్న చిన్న నిర్ణయం అతి పెద్ద భారీ విజయంగా మారుతుంది. మీరు కష్టపడతారు. మీ ప్రణాళిక, శ్రమ కలిసి మీకు అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి.

మకర రాశి
చర్చల్లో విజయాన్ని అందుకుంటారు. మీ మాటను అందరూ వింటారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది. ఈ సమయంలోనే అధిక లాభాలను అందుకుంటారు. కార్యాలయాల్లో మీ మాటను అందరూ వింటారు పై అధికారులతో సహా. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ గతంలో కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా ఉంటాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ఎదురులేకుండా దూసుకువెళతారు.
మీన రాశి
కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు తోడవుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. ఆలోచనా విధానం, పనిచేసే విధానం వ్యక్తులపై ప్రభావం బాగా చూపుతుంది. కెరీర్ పరంగా మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. వృద్ధిలోకి వస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేయడానికి ఇది చాలా అనువైన సమయం. అంతేకాకుండా మీ విధానంతో, మీ నిర్ణయంతో ఇతరులను ఆకర్షిస్తారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. ఇతరులవద్ద నిరూపించుకొని సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు.












Click it and Unblock the Notifications