మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు.. ఇంకెలాంటివి సంభవిస్తాయో తెలుసా..?

మేషరాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 5 , వ్యయం - 5 రాజపూజ్యం - 3 , అవమానం - 1

Mixed results this year for those with Aries Zodiac sign

• మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి.

• గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడతారు,

• ఆగష్టు తర్వాత శుభ ఫలితాలు పొందుతారు.

• ఆర్ధిక ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికినీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

• వ్యాపార, గృహ సంబంధమైన వ్యవహారాలు నత్త నడక నడిచినా కొన్నింటిలో లాభాలు పొందుతారు.

• మిమ్మల్ని ఆన్ని విధాలుగా అనుకూలంగా చూసుకునే వ్యక్తులే కొంచం మీపై వ్యతిరేకత చూపుతారు.

• మీరు ఎంతో రహస్యంగా దాచిన మీ వ్యక్తీ గత విషయాలు బయట పడతాయి. దీని వలన కొంత మనస్తాపం చెందుతారు.

• ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు.

• కుటుంబ, వ్యక్తిగత విషయాలలో మీరే దగ్గరుండి చూసుకోవాలి ... అప్పుడే అవి ఫలితాలను ఇస్తాయి.

• సెప్టెంబర్ నుండి అన్నింటిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉందని గ్రహిస్తారు.

• గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు, కష్టపడి పనిచేస్తారు, అఖండ ఖ్యాతిని పొందుతారు.

• మీకు అత్యంత సన్నిహిత వ్యక్తీ దూరం కావడం మానసిక క్షోభకు గురిఅవుతారు. కొంతకాలం అన్నింటికి దూరంగా ఉంటారు.

• వివాహాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

• పైకి శాంతంగా కనిపించినా కటువుగా కనిపించక పోయిన మనస్సులో ఉన్న పగ , ప్రతీకారాన్ని ఎంతో కాలం పోషిస్తారు.

• విదేశాల నుండి మీరు కోరుకున్న శుభవార్త వస్తుంది.

• కొత్త మిత్రలు దూరం అవుతారు , పాత స్నేహాలు దగ్గరౌతాయి.

• జీవితం రొటిన్ గా ఉండ కూడదని మార్పులు చేయాలని సంకల్పించు కుంటారు.

• రాజకీయ పరమైన విషయాలలో మీ ప్రమేయం అనివార్యం అవుతుంది. ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని రాజకీయ ప్రవేశం ఉంటుంది.

• సమాజంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మీ సలహా, సహాయం అవసరం అవుతాయి.

• మీకు ఎదురుతిరిగిన వారు ఇబ్బందుల పాలౌతారు.

• మీ జాతకంలో దశమ భావం బాగుంటే ఈ సంవత్సరం మీరు కోరుకున్న మంచి ఉద్యోగం వస్తుంది.

• అవివాహితులకు వివాహం జరుగుతుంది.

• కొద్దిగా గైనిక్ ఇబ్బందులు ఉంటాయి. మంచి అనుభవజులైన డాక్టర్ ను సంప్రదించండి.

• సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది. మీకు పెళ్ళి చాలా కాలం అయిన పిల్లలు కలగక పొతే మీ దంపతుల జాతకాలను పరిశీలన చేయించుకొండి.

• జీవిత భాగస్వామితో విభేదాలు రావద్దు , కొంత మంది విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

• కపట స్నేహాలు చేసే వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వలన కొంత ఇబ్బంది తలెత్తుతుంది.

• ప్రభుత్వ ఉద్యోగ సూచనలు ఉన్నాయి, గట్టి ప్రయత్నాలు చేయండి.

• విదేశీ చదువులు, ఉద్యోగాలు చేస్తా అనుకున్న వారికి అనుకూల కాలం.

• కమర్షియల్ ఏరియాలో ఆపార్ట్ మెంట్ కొంటారు.

• కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు.

• ఉద్యోగంలో బదిలీలు సూచిస్తున్నాయి.. కొన్ని సాంకేతిక కారణాలతో బదిలీ ఆగిపోతుంది.

• ఉద్యోగంలో ప్రమోషన్లు కలుగుతాయి.

• పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

• ఒకరు చేసిన తప్పుకు మీరు ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

• సివిల్ సర్వీసులకు ఎన్నిక అవుతారు.

• మీ ఆద్వర్యంలో నడిచేవి లాభసాటిగా సాగుతాయి.

• నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎక్కువ కాలయాపన చేయవద్దు.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+