ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయవద్దు!

మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చాణక్య నీతి చెబుతుంది. మనిషి అన్న తర్వాత ఎదుటివారికి సహాయం చేయడం సహజంగా వచ్చే లక్షణం. అయితే కొందరికి మాత్రం సాయం చేయడంవల్ల జీవితంలో సమస్యలు ఎదురవుతాయని, ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదో ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. వాటి వివరాలను తెలుసుకుందాం.

ఆపదలో ఉన్న మహిళను చూసినప్పుడు చాలామంది భావోద్వేగానికి గురవుతారు. అయితే ఆ మహిళ తన తప్పువల్ల కష్టంలో పడిందా? లేదా? అని అర్థం చేసుకోగలగాలి. ఎక్కువమంది మహిళలు వారి ప్రవర్తన, చర్యలవల్లే ఇబ్బందులకు గురవుతుంటారు. తప్పు అని తెలిసినా పదే పదే అదే తప్పు చేసే మహిళకు ఎట్టి పరిస్థితిలోను సహాయం చేయవద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటివారికి సహాయం చేయడంవల్ల సాయం చేసేవారికి ఆందోళన, ఇబ్బంది తప్పదన్నాడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పురుషులపట్ల ఆసక్తి చూపుతారని చెప్పాడు.

Never help these three persons

ఏ కారణం లేకుండా ఒంటరిగా లేదంటే దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. వారు ఉన్నదాంతో సంతోషంగా ఉండకుండా లేనిదాని కోసం నిరంతరం తహతహలాడుతుంటారు. మీరు కూడా వారిలాగే బాధపడాల్సి ఉంటుంది. తమకంటే పక్కవాళ్లనే ఎప్పుడూ తిట్టుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాంటి వారికి దూరంగా ఉండటమే కాక వారికి సాయం చేయడం కూడా తప్పవుతుంది.

తెలివి తక్కువ వారికి దూరంగా ఉ:డాలి. వారికి ప్రపంచంలో ఏ విషయంపై ఆందోళన ఉండదు. ఇతరుల తప్పులను కనుక్కోవడంపైనే వారికి ఆసక్తి ఎక్కువ. ఇతరులు ఆనందంగా ఉన్నారంటే వారు సంతోషించరు. వారికి సాయం చేయడం తప్పు. జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వడం లేదంటే సాయం చేయడంవల్ల ప్రయోజనం లేదు. చిన్న విషయాలకు కూడా వారు వాదనకు దిగుతారు. దీనివల్ల సమయం, శ్రమ వృథా అవుతాయి. తమను తాము సరైనవారుగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎదుటివారిని తప్పు పడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+