నోస్ట్రడామస్ జాతకానికి తిరుగేలేదు... 2025లో ఈ రాశులే కోటీశ్వరులు
నోస్ట్రడామస్ గురించి ప్రపంచంలో తెలియనివారుండరు. ఆయన ఫ్రెంచ్ దేశానికి చెందినవారు. ప్రఖ్యాత వైద్యులే కాకుండా జ్యోతిష్యంలో ఆయన ఏది చెబితే అదే జరిగేది. భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలను కచ్చితంగా అంచనావేసి చెప్పేవారు. ఆయన చెప్పినవన్నీ 100కు 100 శాతం నిజమయ్యాయి. అమెరికాలో 9/11 దాడులతోపాటు అనేక సంఘటనలు ఆయన చెప్పినట్లుగానే జరిగాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సరిగ్గా అంచనా వేసేవారు. ఆయన జ్యోతిష్యం ప్రకారం 2025లో కోటీశ్వరులయ్యే రాశుల వివరాలను తెలుసుకుందాం. ఆయన చెప్పారంటే లక్ష్యాలను మీరు సాధించినట్లే అని అర్థం. సమయం ఎంతో అనుకూలంగా ఉండి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని నోస్ట్రడామస్ జ్యోతిష్యం చెబుతోంది. ఏయే రాశులు అనే వివరాలను తెలుసుకుందాం.
వృషభం
పెట్టుబడులు పెట్టే సామర్థ్యం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. డబ్బును కూడగడతారు. పట్టుదల, ప్రణాళిక ప్రకారం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. ఇవన్నీ వీరిని కోటీశ్వరులుగా చేస్తాయి. అదృష్టం తోడుంటుంది. సంపదను సృష్టించే సామర్థ్యం వృషభరాశివారికి ఉంది. 2025లో వారికి బాగా కలిసివసవ్తుంది.

సింహ రాశి
నాయకత్వ లక్షణాలు వస్తాయి. పని విషయంలో ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. వ్యాపార ప్రయత్నాలన్నీ విజయంతమవుతాయి. కుజుడు మద్దతుగా ఉండటంవల్ల లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. తమకున్న సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టి వీరంతా కోటీశ్వరులుగా మారతారు.
మకరరాశి
వీరు చేసే అన్ని పనులకు నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడి మద్దతు ఉంటుంది. వీరి పట్టుదల 2025లో ఫలిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేసే పనులన్నీ విజయాన్ని అందిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా స్థిరపడతారు. అందుకు అనేక మార్గాలు వీరికి తోడవుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశివారు 2025లో గణనీయమైన లాభాలను పొందుతారు. సంపదను సృష్టిస్తారు. వ్యూహాత్మకంగా పనులు చేస్తారు. తమకున్న సామర్థ్యంతో ఏ పని తలపెట్టినా విజయాన్ని దక్కించుకుంటారు. అడ్డంకులను ధైర్యంతో అధిగమిస్తారు. ఖగోళంలో మార్పులన్నీ వీరికి అనుకూలంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రాశివారు తమ లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటారు. అందుకు అదృష్టం తోడుంటుంది.
కన్య రాశి
ఏ పని చేయాలన్నా ఎంతో విశ్లేషణాత్మకంగా ఆలోచించి పనిచేసి విజయాన్ని అందుకుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరి ఎంపికలన్నీ ఎంతో తెలివిగా ఉంటాయి. వివిధ వనరుల నుంచి డబ్బను సంపాదిస్తారు. ఆర్థికంగా స్థిరపడతారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మరింత మెరుగైన స్థితిలో ఉంటారు.












Click it and Unblock the Notifications