కాలం అనుకూలంగా ఉంది.. ఈ రాశులవారు మహర్జాతకులే
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలో నిర్ధేశిత సమయంలో ప్రయాణిస్తుంటాయి. ఇలా ప్రయాణించడంవల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎలా కలిసివస్తుంది? ప్రతికూలత ఉంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలుంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
తులా రాశి:ఉద్యోగంలో కోరుకున్నది నెరవేరుతుంది. ధైర్యం, ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తాయి. మీకు ధర్మదేవత అనుగ్రహం ఉంది. వృథా వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇష్టదేవతను దర్శించుకోవడం వల్ల శుభం జరుగుతుంది.

వృశ్చిక రాశి:ధనయోగం ఉంది. కాలం మిశ్రమంగా ఉంది. అయినప్పటికీ అనుభవం రక్షిస్తుంది. ఆత్మీయుల సూచనలతో పరిస్థితులు సరి అవుతాయి గిట్టనివారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. నవ గ్రహ శ్లోకాలను పఠించడంవల్ల శుభం కలుగుతుంది.
ధనుస్సు రాశి:కాలం అనుకూలంగా ఉంది. లాభాలు అనేక మార్గాల్లో వస్తాయి. మంచి పనుల కోసమే సమయాన్ని వెచ్చించాలి. నిరంతరం లక్ష్యంపైనే దృష్టి నిలపండి. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎదురు చూస్తున్న పనులు కూడా పూర్తవుతాయి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మకర రాశి:సకాంలో పనులు పూర్తిచేయాలి. అదృష్టం తోడుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. శుక్రుడి సంచారంవల్ల ఆర్థికంగా బలోపేతమవుతారు. మనోబలం పెరగడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.
కుంభరాశి:ఆర్థికంగా బాగుంటుంది. సంపద పెరుగుతుంది. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు బాగుంది. సంకల్ప బలంతో స్పష్టమైన ఆలోచనలతో లక్ష్యాన్ని చేరతారు. మౌనంగా ఉండటంవల్ల అనేకవిధాలుగా అది మిమ్మల్ని కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
మీన రావి:దైవబలం ముందుకు నడిపిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేయాలి. చెడును ఊహించవద్దు. ఆర్థికంగా నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు పఠించడంవల్ల మేలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications