మార్చి నుండి సంపదల ఖజానా వీరికి రాసిచ్చిన శక్తివంతమైన త్రిగ్రాహి యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల మార్పు, గ్రహాల సంయోగం కారణంగా శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి . అటువంటి యోగాలలో త్రిగ్రాహి యోగం ఒకటి. మీన రాశిలో శని, బుధుడు మరియు సూర్యుడి కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది.
త్రిగ్రాహి యోగం
ఈ సంవత్సరం మార్చి నెలలో ఏర్పడే త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. త్రిగ్రాహి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభం కలగబోతుంది. సంపదల ఖజానాతో త్రిగ్రాహి యోగం వీరికి స్వాగతం పలుకుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మీనరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశిలో పదవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో ధనస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఇది మీకు శుభాలను ఇచ్చే కాలం.
మీన రాశి
మీనరాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగం మీనరాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారి సామాజిక పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం వికసిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications