ఈ రాశులవారిపై సంపదల వర్షాన్ని కురిపిస్తున్న రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువును క్రూర గ్రహంగా, చెడు చేసే గ్రహంగా అందరూ చెబుతారు. అన్ని గ్రహాలు సవ్య దిశలో తిరిగితే, రాహు కేతువులు మాత్రం అపసవ్య దిశలో తిరుగుతూ సంచారం చేస్తాయి. తిరోగమన దిశలో సంచారం చేసే రాహువు అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తారు.
ఉత్తరాభాద్ర మూడవ పాదంలో రాహు సంచారం
ప్రస్తుతం రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొనసాగుతున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు ఆగస్టు 16వ తేదీన తృతీయ స్థానంలోకి ప్రవేశించారు. డిసెంబర్ వరకు రాహువు ఇదే నక్షత్రంలో మూడవ పాదంలో సంచరించనున్నారు. శని దేవుడి నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం మూడు రాశుల వారి జీవితాన్ని అదృష్టమయం చేస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కన్య రాశి
ఉత్తరాభాద్ర మూడవ పాదంలో రాహువు సంచారం కన్యారాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో విశేష ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. విదేశాలలో వ్యాపారం చేసేవారు ఈ సమయంలో బంపర్ లాభాలను పొందే అవకాశం లేకపోలేదు. మానసికంగా ఈ సమయంలో ప్రశాంతంగా కన్యారాశి జాతకులు జీవిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి యొక్క పాలక గ్రహం శుక్రుడు కావడంతో రాహువుకు శుక్రుడికి మధ్య మంచి స్నేహం ఉండడంతో వృషభ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచిలాభాలు వస్తాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారు భారీ ప్రయోజనాలను పొందుతారు. వృషభరాశి వారికి ఇది సంతోషాన్ని కలిగించే సమయం.
తుల రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మూడవ పాదంలో రాహువు సంచారం తులారాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. జీవితంలోని అన్ని రంగాలలోనూ తులారాశి జాతకులు విజయాన్ని సాధిస్తారు. తులారాశిని శుక్రుడు పాలిస్తాడు, కాబట్టి రాహు సంచారం తులారాశి వారికి కూడా లబ్దిని చేకూరుస్తుంది. మీరు ఊహించని విధంగా వివిధ వనరుల నుండి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications