rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారం కారణంగానే ప్రతిరోజు వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మనం తులా రాశి నుండి మీన రాశి వరకు వివిధ రాశుల వారికి నేడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఎవరికి కలిసొస్తుంది.. ఎవరికి కష్టాలు ఉన్నాయి.. అనేది తెలుసుకుందాం.

తులారాశి
తులారాశి జాతకులకు ఆశించిన పురోగతి ఉంటుంది. నేడు వీరికి లాభదాయకంగా ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఎలాంటి ఇబ్బంది అయినా అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే చాలా మంచిది.

rasi phalalu today these zodiac signs started works will be completed

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అధికారులతో అంటీ ముట్టనట్టు వ్యవహరించటమే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు.అయితే నేడు జాగ్రత్తగా ఉండాలని సూచన. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు నేడు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే నేడు వీరికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మొదలుపెట్టిన పనులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చంద్రుని ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు బాగానే ఉంటుంది కానీ జాగ్రత్త అవసరం. మకర రాశి జాతకులు నేడు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలించే అవకాశం ఉంది. శివ స్తోత్ర పారాయణం మంచిది.

కుంభరాశి
కుంభరాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంది. నేడు కుంభరాశి జాతకులు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్ధంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. ఈ రోజు విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు.

మీనరాశి
మీనరాశి జాతకులకు నేడు శుభప్రదంగా ఉంటుంది. నేడు మీనరాశి వారు శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల వలన నేడు మేలు జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. మీనరాశి జాతకులకు నేడు సూర్యారాధన మంచిదని సలహా ఇవ్వబడింది.

మీనరాశి
మీన రాశి జాతకులు నేడు ఏ పని చేసిన వారి కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా ఉంటే మంచిది. లలితా దేవిని స్తుతి చేయడం మంచిదని చెప్పబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+