శక్తివంతంగా మారిన శని.. ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది
మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు శనిదేవుడు. న్యాయానికి, ధర్మానికి ప్రతీక. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ఫలితాలను ప్రసాదిస్తాడు. జాతకంలో శని మంచి శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. వ్యక్తిగత జీవితం, కెరీర్, వ్యాపారం.. ఇలా అన్నీ బాగుంటాయి. మీన రాశిలో సంచారం చేస్తున్న శనిదేవుడు నవంబరు 28వ తేదీ నుంచి వక్రమార్గంలోకి ప్రవేశించాడు. దీనివల్ల కూడ శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
వైద్యం కోసం పెడుతున్న ఖర్చులన్నీ తగ్గిపోతాయి. తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు చేస్తున్నవారు భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటారు. 2026లో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడిని పూజిస్తే కోరుకున్నవన్నీ లభిస్తాయి.

మిథున రాశి
మంచి మంచి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి బాగా కలిసివస్తుంది. మంచి లాభాలు రావడంతోపాటు భవిష్యత్తులో రాబడి వస్తుంది. ఆస్తుల పరంగా ఊహించనిరీతిలో ప్రయోజనాలుంటాయి. కోరుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. శని ప్రభావంతో ఈ రాశివారికి మంచిరోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు.
మకర రాశి
దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అద్భుతమైన లాభాలుంటాయి. భాగస్వామి సలహాతో చేసే పనులవల్ల డబ్బులు వస్తాయి. విజయాలు సాధిస్తారు. ప్రత్యర్థులపై ఊహించని రీతిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. కొన్ని పనులు చేయడానికి సంకల్పిస్తారు. ఆ పనుల్లో విజయాన్ని కైవసం చేసుకుంటారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు.












Click it and Unblock the Notifications