కలలోకి ఈ పక్షి వస్తే కోటీశ్వరులే..!
మన హిందూ సంప్రదాయం ఎన్నో ఆచార వ్యవహారాలతో, నమ్మకాలతో కూడుకున్నది. జీవితంలో సమస్యలు రాకుండా, ఐశ్వర్యం వృద్ధి చెందడానికి అనేక నియమాలను పాటిస్తుంటాం. అలాగే, చెడు జరగకుండా, దుష్ట శక్తులు దూరమయ్యేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం.
ఈ క్రమంలో, మనకు కలలో కనిపించే కొన్ని అంశాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కలలో పక్షులు కనిపిస్తే, అది భవిష్యత్తులో జరగబోయే శుభాలు లేదా అశుభాలను సూచిస్తుందని పండితులు చెబుతుంటారు.

శుభాలను మోసుకొచ్చే పక్షులు:
పాలపిట్ట: కలలో పాలపిట్ట కనిపిస్తే అది శుభసూచకం. మీకు మంచి జరగబోతుందని దీని అర్థం.
హంసలు: కలలో హంసలు కనిపిస్తే ఆర్థిక లాభాలు లేదా ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
నెమలి: నెమలిని కలలో చూస్తే ఇంట్లో శుభకార్యం, ఏదైనా విషయంలో గొప్ప విజయం సాధిస్తారని నమ్మకం. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
డేగ: కలలో డేగ కనిపించడం కూడా శుభప్రదం. ఇది మీ లక్ష్య సాధనలో ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని సూచిస్తుంది.
గుడ్లగూబ: సాధారణంగా భయపడే గుడ్లగూబ కలలో కనిపిస్తే మాత్రం, అది అత్యంత శుభసూచకం. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారని పండితులు చెబుతారు.
కలలు అనేవి కేవలం మన ఉపచేతన మనస్సు ఆలోచనలే కాకుండా, కొన్నిసార్లు భవిష్యత్ సంకేతాలను కూడా అందిస్తాయని హిందూ సంప్రదాయం విశ్వసిస్తుంది.












Click it and Unblock the Notifications