నేటినుండి వీరికి సంపదల వర్షం ప్రకటించిన శనిదేవుడు!
జ్యోతిష శాస్త్రంలో శని దేవుడికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. నవగ్రహాలలో శని చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అటువంటి శనిదేవుడు నేడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ అమావాస్య రోజు శనిదేవుడు జన్మించాడని చెబుతారు. అందుకే నేడు శని జయంతిగా జరుపుకుంటారు.
శని జయంతి
శని జయంతి రోజున ఎవరైతే శనిదేవుని పూజిస్తారో, పితృదేవతలకు తర్పణాలను సమర్పించి, శని పూజలు చేస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని దోషము, కష్టాలు తొలగిపోయి వారు జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. శని జయంతి రోజు శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు.

శని జయంతి నాడు శుభ యోగాలు
శని జయంతి రోజున గ్రహాల సంచారం అనేక శుభ యోగాలను ఏర్పరుస్తుంది. నేడు సుకర్మ యోగం, ధృతి యోగం, ద్వి పుష్కర సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇక నేటినుండి శని దేవుడు కొన్ని రాశుల వారికి సిరిసంపదలను ఇస్తున్నాడు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని జయంతి నుండి ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలనుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగిస్తారు. జీవితంలో సానుకూల శక్తి వ్యాపించి అన్ని విధాల లాభాలు పొందుతారు. శని జయంతి రోజున వీరికి విలాసాలు, సౌకర్యాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు వస్తాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి శని జయంతి నుండి సానుకూల ఫలితాలు వస్తాయి. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు వింటారు. శని ఆశీస్సులతో వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మకర రాశి
శని జయంతి నుంచి మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసిన మంచి జరుగుతుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. మకర రాశి జాతకులు ప్రతిరంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications