కుజుడి సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
జ్యోతిష్యం ప్రకారం కుజుడు సంచరిస్తే కొన్ని రాశులవారికి బాగా కలిసివస్తుంది. ఈరోజే కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. శక్తికి, భూమి, బలం, సోదరుడు, ధైర్యానికి సూచిక కుజుడు. కుంభరాశిలో 11వ స్థానంలో సంచారం చేయడంవల్ల కొన్ని రాశులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం తోడుంటడంవల్ల విపరీతమైన లాభాలను పొందుతారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు అనేక విజయాలు సాధిస్తారు. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

మిథున రాశి
కెరీర్ కు సంబంధించి ఈ రాశివారు అపారమైన లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడటంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. డబ్బు సంపాదన చాలా బాగుంటుంది. వీటిని మంచి కార్యానికి ఉపయోగిస్తే రెండింతలు లాభాలుంటాయని పండితులు తెలియజేస్తున్నారు.
సింహ రాశి:
ఊహించని రీతిలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం రెట్టింపవుతుంది. వాహన సౌకర్యం కలుగుతుంది. ఏ పనిలోనైనా సులువుగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడి సంతోషాన్ని కలిగిస్తుంది.
కన్య రాశి:
వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లయినవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనసులో సంతోషం పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications