కుంభరాశిలోకి రాహువు... ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

రాహువు, కేతువుకు నీడ గ్రహాలని పేరు. అందరూ ఈ రెండు పేర్లు చెబితే భయపడతారు. ప్రతి 18 నెలలకు ఒకసారి ఇవి తమ రాశిని మారుస్తుంటాయి. శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి రాహువు మే 18వ తేదీన ప్రవేశిస్తున్నాడు. ఈ పరిణామం చాలా రాశులకు అనుకూలంగా ఉండబోతోంది. 18 నెలలు అక్కడే ఉండే రాహువు వల్ల ఆరు రాశులవారికి 18 నెలలపాటు తిరుగులేని విధంగా ఉంటుంది. రాహువు ఈ రాశులకు అనుకూలంగా ఉండి అన్ని పనులు సంపూర్ణంగా జరగాలంటే సుబ్రమణ్యాష్టకం పఠించాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

కన్యారాశి
వృత్తి, వ్యాపారాలు కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నాయి. ఇకనుంచి చాలా చురుగ్గా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంతోపాటు పెళ్లి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

six zodiac signs will become millionaires and get good health due to rahu will enter aquarius from may 18th

ధనుస్సు రాశి
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యం ఉంది. అర్దాష్టమ శని ప్రభావం నుంచి బయటపడతారు.

మకర రాశి
ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎదుటివారికి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. ఆస్తి వివాదాలన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. పెళ్లి ప్రయత్నం విజయవంతమవుతుంది. మనసులోని కోరికలన్నీ తీరతాయి. ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం వేగంగా పెరుగుతుంది.

మేషరాశి
వీరికి ఏలిననాటి శని ప్రారంభం కాబోతోంది. విదేశీ సంపాదనను అనుభవిస్తారు. ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు తలుపు తడతాయి. విదేశాలకు వెళ్లాలనే ఉద్యోగుల కల నెరవేరుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

వృషభ రాశి
విదేశాల్లో ఉద్యోగం రావడం జరుగుతుంది. వృత్తిలో ఉన్నవారు కూడా విదేశాలకు వెళతారు. ఆదాయం విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొంతకాలంగా నలుగుతున్నాయి. అవన్నీ ఈ సమయంలో మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

మిథున రాశి
న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు నుంచి తీర్పు అనుకూలంగా వస్తుంది. దీంతోపాటు తండ్రివైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. వైద్యానికి అవుతున్న ఖర్చులు కూడా తగ్గిపోతాయి. విదేశీయోగం ఉంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+