జనవరి 14వ తేదీ లోపు ఈ రాశులు కోటీశ్వరులవకపోతే పేరు మార్చుకుంటా
ధనుర్మాసం ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కల్యాణం నిర్వహిస్తారు. ఈ మాసంలో ఇంట్లో శుభకార్యాలు చేయడం మంచిది. కొన్ని రాశులవారు బాగా అభివృద్ధి చెందుతారు. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠించినవారికి మంచి లాభాలు కలుగుతాయి. ఏయే రాశులవారు ధనుర్మాసంలో లాభపడుతున్నారో తెలుసుకుందాం.
కుంభం
అన్నివైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలతోపాటు రుణ సమస్యల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి అవి లాభసాటిగా మారతాయి. ఏలిననాటి శని దోషం తొలగిపోతుంది.

మీనం
ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలగా వస్తాయి. ప్రభుత్వం నుంచి మీరు కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం నిరుద్యోగులకు దక్కుతుంది. వృత్తితోపాటు ఉద్యోగంలో కూడా మీ ప్రభావం పెరుగుతుంది.
కర్కాటకం
ఉద్యోగస్తులకు స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు పోటీ తగ్గడంవల్ల లాభాలు పెరుగుతాయి. నష్టాల నుంచి బయటపడటంతోపాటు కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తారు. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది కానీ అది దూర ప్రాంతంలో దొరుకుతుంది. ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది.
సింహం
సంపద బాగా పెరుగుతుంది. కలిసివచ్చి అన్ని పనులు సానుకూలంగా జరుగుతాయి. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ నైపుణ్యంతో మీరు పనిచేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి వెల్లడానికి మార్గాన్ని ఏర్పరుచుకుంటారు.
తుల
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
ధనుస్సు
విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు, తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఒక సంస్థకు అధికారి అయ్యే హోదా ఉద్యోగులకు దొరుకుతుంది.












Click it and Unblock the Notifications