ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు... ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. వృషభరాశిలో సంచరిస్తున్న చంద్రుడు ఈనెల 14వ తేదీన అదే రాశిలోకి రానున్న బృహస్పతితో కలుస్తాడు. వీరిద్దరి కలయికవల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. అప్పటికే బుధుడు, సూర్యుడి కలయికవల్ల బుధాదిత్య యోగం ఏర్పడివుంది. ఇలా రెండు యోగాలు ఒకేసారి ఏర్పడటం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. దీనివల్ల కొన్ని రాశులవారు మంచి అదృష్టవంతులు కాబోతున్నారు. ఏయే రాశులనే వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో రాజయోగం ఉంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భారీగా లాభార్జన చేస్తారు. ఉద్యోగస్తులకు బాగా డిమాండ్ ఉంటుంది.

వృషభ రాశి
ఈ రాశివారు మట్టి పట్టుకున్నా బంగారమవుతుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంది. వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. వృత్తితోపాటు వ్యాపారాల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. మంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచన చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. గొడవలున్నప్పటికీ భార్యాభర్తలు ఇప్పుడు సర్దుకుపోతారు. తర్వాత ఇవి తీవ్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది.
వృశ్చిక రాశి
వీరికి అదృష్టం కలిసివస్తుంది. సమాజంలో గుర్తింపు లభించడంతోపాటు విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ ప్రాబల్యం పెరుగుతుంది. అంచనాలకు మించి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి
ఉద్యోగంలో స్థిరపడతారు. మంచిరోజులున్నాయి. వ్యాపారాలు భారీగా వృద్ధి సాధిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది. ఇల్లు, బండి యోగం ఉంది.
కుంభ రాశి
పూర్వీకుల నుంచి ఆస్తి కలిసిరావడంతోపాటు విదేశీ వ్యవహారాల్లో కూడా లాభం ఉంటుంది. వివాహం మాత్రం విదేశాలకు చెందిన వ్యక్తితో జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఉన్న రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. కుటుంబం సంతోషంగా గడుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తితోపాటు ఉద్యోగాల్లో కూడా సమర్థతకు తగ్గట్లుగా రాణిస్తారు. రెండు రాజయోగాలు వీరికి మంచి లాభాలను కలగజేస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు.












Click it and Unblock the Notifications