కుజుడి బలంతో ఈ రాశులకు ధనయోగంతోపాటు అధికార యోగం ఉంది

నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు స్థిరాస్తికి, ధైర్యానికి, సాహసానికి కారకుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న కుజుడు తనకు ఇష్టమైన పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈనెల 21వ తేదీన మిథునరాశిలోకి తిరోగమనంద్వారా ప్రవేశిస్తున్నాడు. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. దీనివల్ల ఆరు రాశులవారికి బాగా కలిసిరానుంది. ఏయే రాశులు, ఏవిధంగా ఆర్థిక లాభాలను పొందనున్నారో తెలుసుకుందాం.

వృశ్చికం
వృత్తి, ఉద్యోగ రీత్యా విదేశీయానం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనయోగంతోపాటు అధికార యోగం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

six zodiac signs will get huge money and obtain power due to mars enter gemini from january 21st

మీనం
అంచనాలకు మించి వ్యాపారంలో, వృత్తిలో లాభాలుంటాయి. పెండింగ్ పనులన్నింటినీ శరవేగంతో పూర్తిచేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. సంతానానికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది.

మేషం
అతిచార బలంతో కుజుడు ఈ రాశివారికి ధనలాభాన్ని కలిగిస్తున్నాడు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యం ఉంది. సుఖసంతోషాలు నెలకొంటాయి.

కర్కాటకం
ఆదాయం వృద్ధి చెందడానికి, అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు వెల్లువలా వస్తాయి. కొంతకాలం నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగులకు పదవీ యోగం ఉంది.

కన్య
విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆస్తుల విలువ భారీగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరగడంతోపాటు గతంలో రాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. సొంతింటి ప్రయత్నాలు నెరవేరతాయి.

తుల
నిరుద్యోగులకు ఊహించనిరీతిలో అవకాశాలు వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళతారు. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభంతోపాటు ఆకస్మిక అధికార లాభం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+