గత నెల 30 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
కార్తీక అమావాస్యను జరుపుకోవడంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. కొందరు శనివారం, మరికొందరు ఆదివారం జరుపుకున్నారు. సోమవారం రోజు కార్తీక దీపాలను విడిచిపెట్టారు. చంద్రుడికి పౌర్ణమి నాటి చంద్రుడి బలం కలగడంవల్ల ఆరు రాశులవారికి బాగా కలిసివస్తోంది. వృశ్చిక రాశిలో చంద్రుడు, సూర్యుడు కలిశారు. బృహస్పతి సంపూర్ణమైన దృష్టితో ఉన్నాడు. ఈ పరిణామాలన్నీ ఈ రాశులకు బంగారమయ్యాయి.
వృషభం
ఆదాయం పెరగడంతోపాటు ఆర్థికంగా బలపడతారు. ఎక్కువగా శుభవార్తలను వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి పరిణామాలు ఎదురుకానున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

కర్కాటకం
గజకేసరి యోగం ఏర్పడటంవల్ల వీరి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి. సమాజంలో గౌరవంతోపాటు హోదా కలుగుతుంది. పరిచయాలు కొత్తగా ఏర్పడతాయి. ఇవి లాభసాటిగా ఉంటాయి.
తుల
ఆదాయం పెరగడంతోపాటు కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలుచేస్తారు. మాటకు కుటుంబంలో, సమాజంలో విలువ పెరుగుతుంది. ఆస్తులు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.
వృశ్చికం
ఉద్యోగంలో మంచి ప్రాధాన్యం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో చురుగ్గా ఉంటారు. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం
ఉద్యోగంలో జీత భత్యాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. పెళ్లి ప్రయత్నాలన్నీ కలిసివస్తాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
మీనం
శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కొత్త ఇల్లు లేదంటే కొత్త వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. రావల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యగాలు చేస్తున్నవారితోపాటు నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి అవకాశాలు దక్కుతాయి.












Click it and Unblock the Notifications