బృహస్పతి అపార దయ... ఈ రాశులకు అఖండ ధనయోగం

నవగ్రహాల్లో అతి కీలకమైంది బృహస్పతి. విద్యకు, విజ్ఞానానికి, సంపదకు, జీవితానికి కారకుడు. ధనం, ఇల్లు, సంతానం, అభివృద్ధి వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. అటువంటి గురువుకు అతివక్రం పట్టింది. దీనివల్ల కొన్ని రాశులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. సొంతింటి కల నెరవేరుతుంది. అతివక్రం వల్ల ప్రధానంగా ఆరు రాశులవారు లాభపడుతున్నారు. వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

మేషం
రోజురోజుకు ఆదాయం పెరుగుతుంది. పెళ్లి, కొత్తింట్లోకి ప్రవేశంలాంటి శుభకార్యాలున్నాయి. పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. షేర్లకు సంబంధించినవాటిల్లో మదుపు చేస్తారు. ఆర్థిక సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చాలా ఎక్కువగా పెడతారు.

six zodiac signs will get more money and major changes in life due to planet jupiter ativakra

కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలన్నీ విస్తరిస్తాయి. డబ్బులు వస్తాయి. పిల్లలు మంచి విజయాలను సాధిస్తారు. వృత్తితోపాటు ఉద్యోగాల్లో కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకొని అందలాలు ఎక్కడంవల్ల పరిచయాలు పెరుగుతాయి. ఇవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.

సింహం
ఆదాయంవల్ల అంచనాలకు మించి లాభాలున్నాయి. కొత్త ఇల్లు లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబంలో ఊహించని రీతిలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా స్థిరపడతారు.

తుల
గతంలో నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్యలు, వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలన్నీ సానుకూలంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు విదేశాలకు వెళతారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది.

మకరం
ఉద్యోగంలో పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు అందుతాయి. విద్యార్థులు చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఘనవిజయాన్ని అందుకుంటారు. పిల్లలు లేనివారికి సంతానం ఉంది. మనసులో కోరికలన్నీ నెరవేరతాయి.

మీనం
పదవీ లాభం ఉంది. వృత్తితోపాటు ఉద్యోగంలో కచ్చితంగా పైస్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు నష్టాల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఇప్పుడు పూర్తవడంతోపాటు ఆర్థికంగా లాభపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+