రాసిపెట్టుకోండి... ఈ నెలాఖరులోగా ఈ రాశులవారు కోటీశ్వరులవడం ఖాయం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొందరికి మంచి ఫలితాలు కలిగితే మరికొందరికి చెడు ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులపై మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ నెలలో ఐదు గ్రహాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల ఆరు రాశులకు ఆర్థికంగా కలిసిరానుంది. వీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవడంతోపాటు అదృష్టవంతువుతారు. శుభవార్తలను ఎక్కువగా వింటారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ నెలాఖరులోగా కోటీశ్వరులయ్యేవారికి ఏవిధంగా అదృష్టం పడుతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం.
మేషం
శని, గురుడు, శుక్రుడు, కుజుడు జాతకంలో బలంగా ఉన్నారు. వృత్తితోపాటు వ్యాపారంలో కూడా బాగా కలిసివస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వీరు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న రీతిలో జీతభత్యాలు వస్తాయి.

కర్కాటకం
దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. లాభార్జన ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తోపాటు వేతన పెరుగుదల ఉంటుంది. సొంతింటి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రలకు వెళతారు.
కన్య
బాగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించబోతోంది. రాజపూజ్యాలు ఉన్నాయి. కుబేరుడి అనుగ్రహం వల్ల డబ్బుకు లోటుండదు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. విజయం సులువుగా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు వస్తాయి.
వృశ్చికం
అన్నివైపుల నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారంతోపాటు వృత్తిలో లాభాలు అంచనాలను మించుతాయి. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మకరం
సమాజంలో పేరు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆదాయం కలిసివస్తుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
మీనం
ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వ్యాపారం, వృత్తిలో లాభాలున్నాయి. కోర్టు కేసులు అనుకూలగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications