20న తొలి సూర్యగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Solar Eclipse: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు ఎక్కువ ప్రామఖ్యత ఉంటుంది. గ్రహణాల సందర్భంగా ఇళ్లల్లో ఏ విధమైన శుభ కార్యాలు చేయరు. చాలామంది బయటకు కూడా రారు. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
2023 సంవత్సరానికి ఏప్రిల్ 20వ తేదీన తొలి సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఏం చేయాలి.. ఏం చేయకూడదనేది జ్యోతిష్యంలో వివరంగా ఉంది. గ్రహణం మూడు ప్రత్యేక రూపాల్లో ఏర్పడబోతోంది. దీనినే వార్షిక, సంపూర్ణ, పాక్షిక గ్రహణాలుగా పిలుస్తారు. సూర్యుడికి ఓ భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

చంద్రుడు సూర్యకాంతిని కొద్దిగా నిరోధించగలడు. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యలో వచ్చినప్పుడు వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే వరుసలో వచ్చినప్పుడు భూమిలోని ఓ భాగం చీకటిగా మారుతుంది. తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీ గురువారం ఏర్పడబోతోంది. ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 గంటల వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు
* సూర్య గ్రహణం సందర్భంగా పడుకోకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
* సూర్య గ్రహణం సమయంలో వండటం లేదా తినడం చేయకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
* గర్భం దాల్చిన మహిళలు సూర్య గ్రహణం చూడకూడదు. అంతేకాదు.. బయటకు వెళ్లకుండా ఉండాలి. వీలైనంతవరకు ఆధ్యాత్మికంగా గడపాలి.
* సూర్య గ్రహణం సమయంలో దేవాలయాలకు వెళ్లి దర్శనం, పూజలు చేయకూడదు. ఆ సమయంలో దేవాలయాలు మూసేస్తారు. ఎవరింట్లో వారు ప్రార్థనలు చేసుకోవాలి.
* సూర్య గ్రహణానికి రెండురోజుల ముందే సూర్యుడు రాశుల్ని మారుస్తాడు. సూర్య గ్రహణం సందర్భంగా గురుడు భూమిని క్రాస్ చేస్తాడు. ఇండియాలో సూర్య గ్రహణం కన్పించనందున సూతకకాలం వర్తించదు












Click it and Unblock the Notifications