త్వరలో సూర్య గ్రహణం.. ఈ రాశులకు హానికరం

హిందూ సాంప్రదాయం సూర్యుడిని గ్రహంగా భావించదు. భగవంతుడిలా కొలుస్తారు. అంతటి సూర్యుడికి గ్రహణం పట్టిన సమయంలో పలు రాశిచక్ర గుర్తులు ప్రభావితమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యం కానీ, సైన్స్ కానీ చెప్పే విషయాల్లో తేడాలుంటాయికానీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. వేద జ్యోతిష్యంలో భానుడికి ప్రత్యేక స్థానం ఉంది.

2023 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటికే సంభవించింది. అలాగే చంద్ర గ్రహణం కూడా సంభవించింది. మరో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించాల్సి ఉంది. చివరిది, రెండోది అయిన సూర్య గ్రహణం అక్టోబరు నెలలో రానుంది. 14వ తేదీన సూర్య గ్రహణం ఉంది. ఆ సమయంలో సూర్యుడు ఉంగరం ఆకారంలో కనిపిస్తాడు. ఈ రకమైన గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.

solar eclipse

భారతదేశ కాలమానం ప్రకారం రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2.25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. రెండో సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశులకు హానికరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులా రాశి
తలా రాశి వారిపై చెడు ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ప్రవర్తనలో చిరాకు ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో నోటిని సాధ్యమైంతన వరకు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఆ మాటలవల్లే హాని జరుగుతుంది.

మేష రాశి
మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. సన్నిహితుల చేతిలో మోసపోతారు. ఉద్యోగస్తులు పలు సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండటం మంచిది.

solar eclipse

వృషభరాశి
వృషభ రాశి వారికి ధన నష్టం కలుగుతుంది. మాట్లాడే మాటలపై సంయమనం ఉండాలి. లేదంటే మాటే హాని చేస్తుంది. ఎటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి.

solar eclipse

కన్యారాశి
ఈ రాశివారికి ఇది సూర్య గ్రహణం శుభకరం కాదు. బంధువులు, స్నేహితులతో ఈ రాశుల వారికి విభేదాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం తెచ్చుకోకుండా, ఎదుటివారితో వాదించకుండా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+