త్వరలో శనిదేవుడి అతివక్ర గతి.. ఈ రాశులకే కుబేరుడి సంపదల అనుమతి!
జ్యోతిష శాస్త్రంలో శని దేవుడికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శని దేవుడు కర్మ దేవుడు. ఆయన కర్మలకు అధిపతి. క్రమశిక్షణ నేర్పించే దేవుడు. న్యాయానికి ప్రతీక. అటువంటి శని దేవుడు క్రమశిక్షణతో పనిచేసేవారిని ఎప్పుడూ కరుణిస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే సెప్టెంబర్ 10వ తేదీన మీన రాశిలో శని దేవుడు అతి వక్రం చెందుతాడు.
శనిదేవుడి అతి వక్రగతి ..ఈ రాశులకు లక్
అసలు సాధారణ వక్రగతి లో ఉన్న శని తనకు సప్తమ స్థానమైన కన్యారాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్న కారణంగా అతి వక్రం చెందుతాడు. 75 రోజులపాటు శని దేవుడి అతి వక్ర స్థితి కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిలో లాభ స్థానంలో ఉన్న శని అతి వక్రం చెందడం వల్ల అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. షేర్ల బిజినెస్ చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారి కలలు నెరవేరుతాయి.
మిధున రాశి
మిధున రాశిలో దశమ స్థానంలో శని సంచారం చేస్తూ అతి వక్రం చెందడం వల్ల వీరికి కలిసి వస్తుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులు విదేశాలలో ఉద్యోగం చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. తండ్రి నుండి ఆస్తులు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో నవమ స్థానంలో శని సంచారం చేస్తూ అతి వక్రం చెందడం వల్ల వీరికి ఉన్న శని దోషం తొలగిపోయి కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
తులారాశి
తులా రాశి వారికి ఆరవ స్థానంలో శని సంచారం చేస్తూ అతి వక్రం చెందడం వల్ల వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ లు వంటివి బాగా లాభాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలు చేసే వారికి అధికార యోగం పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో పంచమ స్థానంలో శని సంచారం చేస్తూ అతి వక్రం చెందడం వల్ల వృశ్చిక రాశి జాతకులకు కలిసి వస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. మీరు మనసులో కోరే కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారి సమర్థతకు ఉద్యోగం చేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి.
మకర రాశి
మకర రాశిలో మూడవ స్థానంలో శని అతి వక్రం చెందడం వల్ల వీరికి కలిసి వస్తుంది. అనేక మార్గాలలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications