మరో పదిరోజుల్లో పులిపంజా చీల్చి సంపన్నులయ్యేది వీరే!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. ఇలా గ్రహాలు చేసే సంచారం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం సెప్టెంబర్ మాసంలో రెండు ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.
రెండు ముఖ్య గ్రహాల సంచారంతో వీరికి లాభాలు
ఇక అదే రోజు బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. వారికి ఆకస్మిక ధన లాభాలను తెస్తుంది. మరి ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
సెప్టెంబరు నెలలో శుక్రుడు, బుధుడు చేసే సంచారం మేష రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు వీరికి బుధుడు, శుక్రుడు మంచి లాభాలను అందిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు లభిస్తుంది .ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ లు చేస్తే కలిసి వస్తుంది.
మిధున రాశి
శుక్రుడు, బుధుడు రాశి మార్పు మిధున రాశి జాతకులకు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు పురోగతిని సాధిస్తారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
కుంభరాశి
సెప్టెంబర్ మాసంలో కుంభరాశి జాతకులు శుక్ర, బుధ సంచారం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఈ రాశి వారికి శుక్రుడు, బుధుడు అనేక లాభాలను తీసుకువస్తారు. ఉద్యోగం చేసేవారు సక్సెస్ అవుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థికపరంగా కుంభరాశి వారికి ఈ నెల కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications