ఈరాశి వారికి ఆ సమయంలో ఆకస్మిక ధనలాభం
ఈ ఏడాది చివరికి రాహువు12వ ఇంటిలో ఉండటంతో శుభకార్యాలకు, ఆరోగ్యం కోసం, ఇతరులు మోసపూరితంగా డబ్బు తీసుకోవడంవల్ల నష్టపోయే ప్రమాదముంది.
మేష రాశివారి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే 20223 వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే అవకాశం ఉంది. గురువు గోచారం ఏప్రిల్ వరకు 12వ ఇంటిలో ఉండటంవల్ల ఖర్చులు అదుపు తప్పుతాయి. పొగడ్తలకు లొంగిపోయి అనవసర విలాసాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడంకానీ, ఇతరుల మాటకు గౌరవం ఇవ్వడం కానీ చేయడంవల్ల కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రలోభాలకు లొంగిపోకుండా దృఢంగా నిలబడాలి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
శని గోచారం 11వ ఇంటిలో ఆ సమయంలో అనుకూలంగా ఉంటుంది. చేసిన తప్పును సరిదిద్దుకొని తిరిగి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు పొందుతారు. ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య వీరికి చాలా అనుకూలం. ఆకస్మిక ధనలాంకానీ, గతంలో వివాదాల కారణంగా కోర్టు కేసుల కారణంగాకానీ మీకు రాకుండా ఆగిపోయినవన్నీ తిరిగి వచ్చే అవకాశముంటుంది.
గతంలో చేసిన పెట్టుబడుల నంచి మీకు ధనలాభం ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు 1వ ఇంటిలో గోచరిస్తుండటంవల్ల గురు దృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై, 5 ఇంటిపై ఉండటంవల్ల షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల కారణంగా లాభాలు వచ్చి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

విలువైన బహుమతులందుతాయి
ఈ ఏడాది చివరికి రాహువు12వ ఇంటిలో ఉండటంతో శుభకార్యాలకు, ఆరోగ్యం కోసం, ఇతరులు మోసపూరితంగా డబ్బు తీసుకోవడంవల్ల నష్టపోయే ప్రమాదముంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్యకాలంలో మిత్రుల నుంచికానీ, బంధువుల నుంచికానీ, తోబుట్టువుల నుంచికానీ విలువైన బహుమతులందుతాయి.

ఆ సమయంలో పెట్టుబడి పెట్టొద్దు
ఈ ఏడాది ఖర్చుల ర్చుల విషయంలో మీ మనసును ఆధీనంలో ఉంచుకోవటం అత్యంత అవసరం. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సూర్యుని గోచారం మీకు అనుకూలంగా ఉండే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 మధ్యలో, జూన్ 15 నుంచి జూలై 17 మధ్యలో, అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యలో పెట్టుబడులు పెట్టడం మంచిది.
సూర్యుడు అనుకూలంగా లేని మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు, జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు, నవంబరు 17 నుంచి డిసెంబరు 16 వరకు మధ్యకాలంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications