ఈనెల 12వ తేదీ నుంచి ఈ రాశుల తలరాత మారుతోంది... బాగా కలిసివస్తుంది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశి చక్ర గుర్తులకు మంచి, మరికొన్ని రాశి చక్ర గుర్తులకు చెడు ఫలితాలను ఎదురవుతుంటాయి. ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చే నవగ్రహాల రాజైన సూర్యభగవానుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి మార్చి 14వ తేదీ వరకు కుంభరాశిలోనే సంచరిస్తుంటాడు. దీనివల్ల నాలుగు రాశులకు అదృష్టం కలిసివస్తుంది.
మేషం
కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు. వారినుంచి ఏ పని తలపెట్టినా సంపూర్ణ మద్దతు దొరుకుతుంది. మనసు సంతోషంతోపాటు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంలోకి ప్రవేశిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు.

వృశ్చికం
ఆర్థిక సంబంధ విషయాల్లో బాగా కలిసివస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవికూడా ఆర్థికంగా కలిసివస్తాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారికి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి.
వృషభం
వీరికి అదనపు ఆదాయం సంపాదించేందుకు మార్గాలు దొరుకుతాయి. చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కాలం కలిసివస్తుందని చెప్పొచ్చు.
సింహం
సమాజంలో హోదా పెరగడంతోపాటు గౌరవం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ ఒకేమాట మీద ఉంటారు. బంధువులతోపాటు తోబుట్టువుల నుంచి, అన్నదమ్ముల నుంచి చేసే పనికి మద్దతు లభిస్తుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications