వృషభరాశిలో సూర్య సంచారం.. రాజకీయ అశాంతి; బంగారం ధరలపైనా ప్రభావం
గ్రహాలకు రారాజు సూర్యుడు. ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అయితే మే 14వ తేదీన సూర్యుడు వృషభ రాశిలోకి రవాణా అవుతున్నాడు.సూర్యుడు నెలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నెలలో సూర్యుడు అక్షయ తృతీయ జరిగిన మూడు రోజుల తర్వాత మేష రాశి నుండి వృషభ రాశి లోనికి ప్రవేశిస్తున్నాడు.
రాజకీయాలపై ప్రభావం
సూర్యుడు మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల 41 నిమిషాలకు వృషభ రాశిలోకి వెళుతున్నాడు. వృషభ రాశి లోకి సూర్య సంచారంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశిలో సూర్య సంచారం ప్రభావం రాజకీయాలపై గణనీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేయదు. భారతదేశం యొక్క జాతకం వృషభ రాశికి చెందిన జాతకం.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రాజకీయ అశాంతి
సూర్యుడు ఒకటో ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు కలగవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలోనూ రాజకీయ అశాంతి కనిపించవచ్చు. వివిధ ప్రధాన దేశాలలోని ప్రభుత్వం ఈ సమయంలో దేశంలోని అంతర్గత వ్యవస్థను సరిగ్గా నిర్వహించక పోవచ్చు.
ఈ రంగాలలో పరిశ్రమలకు లబ్ది
వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా ఔషధరంగం, విద్యుత్ రంగం, సిమెంట్ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పనితీరును కనపరిచే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆప్టికల్ పరిశ్రమ బాగా లాభపడుతుంది. సూర్యుడు మరియు కుజుడు మంచి స్థానాలలో ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తుల పరిశ్రమ, ఎలక్ట్రికల్ పరిశ్రమ, వజ్రాలపరిశ్రమ, కెమికల్, హెవీ ఇంజనీరింగ్, టి మరియు కాఫీ పరిశ్రమ అన్ని మంచి పనితీరునే కనబరుస్తాయి.
బంగారం ధరలపై ప్రభావం
బంగారం ధరలు కొత్త గరిష్టాన్ని తాకవచ్చు. ఎడ్ టెక్ సంస్థలు, విద్యా సంస్థలు ఈ కాలంలో బాగా పనిచేసే అవకాశం ఉంది. ఇక వృషభ రాశిలో సూర్య సంచారం ఉపాధ్యాయులకు, ఆధ్యాత్మిక బోధకులకు, రచయితలు, కళాకారులు మొదలైన వారికి శుభ సమయంగా చెప్పొచ్చు.
రైతులకు లబ్ది... స్టాక్ మార్కెట్ పైన ప్రభావం
రైతాంగానికి కూడా ఈ సమయం మంచి సమయం. ఈ సమయంలో మంచి దిగుబడులు, మంచి పంటలతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. రైతులు తప్పకుండా ప్రయోజనాలను పొందుతారు. వైద్య రంగంలోను గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ లోనూ కాస్త సానుకూల ధోరణి కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications