ఆశ్లేష నక్షత్రంలో సూర్య సంచారం.. ఆగస్టులో వీరి జీవితం స్వర్ణమయం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం పడుతుంది. గ్రహాలు రాశులు మరియు నక్షత్రాలలోకి మారుతున్నప్పుడు అనేక ప్రభావాలను చూడొచ్చు. ప్రస్తుతం సూర్యుడు శని యొక్క పుష్య నక్షత్రంలో సంచరిస్తున్నాడు. సూర్య సంచారం కొన్ని రాశులకు శుభాలను, కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది.
ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు
అయితే ఆగస్టు 2వ తేదీన సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలో కే ప్రవేశిస్తాడు. బుధుడి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో సూర్యుని సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి మార్పు చెందడం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభరాశి వారికి ఇప్పటివరకు ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వారి తమ జీవితంలోని వివిధ అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాల్లోనూ గణనీయమైన లాభాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం.
మిధున రాశి
సూర్యుని నక్షత్ర మార్పు మిధున రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో తమ కెరీర్లో పురోగతిని సాధిస్తారు. మిధున రాశి స్థానికులు ఈ సమయంలో అదృష్టవంతులుగా మారుతారు. ఉద్యోగస్తులు కెరీర్ లో అన్ని విజయాలను పొందుతారు. ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.
తులారాశి
సూర్యుడు నక్షత్ర మార్పు తులారాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసొస్తుంది. ప్రతి పనిలోనూ ఈ సమయంలో తులారాశి జాతకులు విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు తీరుతాయి. విదేశాల నుంచి ఈ సమయంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం. ఆశ్లేష నక్షత్రం లోకి సూర్యుడు ప్రయాణం చేయడం తులా రాశి జాతకులకు ఒక వరం లాంటిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications