త్వరలో వీరికి సిరిసంపదలను ప్రకటించిన సూర్యుడి నక్షత్ర సంచారం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. సెప్టెంబర్ 30 తేదీన సూర్యుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. పూర్వ ఫాల్గుణి నక్షత్రాన్ని పుబ్బ నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రానికి శుక్రుడు అధిపతి.
పుబ్బ నక్షత్రం లోకి సూర్య సంచారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి శుక్రుడికి మధ్య విరోధం ఉంటుంది. సూర్యుడు శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. అయితే పుబ్బ నక్షత్రం లోకి సూర్య సంచారంతో కలిసి వచ్చే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
పుబ్బ నక్షత్రం లోకి సూర్యసంచారం కారణంగా సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో సింహ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సూర్య సంచారం వల్ల వీరికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.
కన్యా రాశి
పుబ్బ నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా కన్యా రాశి వారికి లబ్ధి జరుగుతుంది. కన్యా రాశి వారి జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది. వీరికి పనిలో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలను పొందుతారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల వల్ల కన్య రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరే అవకాశం కూడా ఉంది.
తులారాశి
పుబ్బ నక్షత్రంలోకి సూర్య సంచారం వల్ల తులా రాశి వారు లాభపడతారు .తులా రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మేష రాశి
సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుంది. మేష రాశి వారు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మంచి ఉద్యోగ ఆఫర్లతో మేష రాశి జాతకులకు ఈ సమయం కలిసి వస్తుంది. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications